నాయుడుపేట టౌన్: ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న అండర్– 16 జాతీయ సబ్ జూనియర్ ఫుట్బాల్ పోటీల్లో నాయుడుపేటకు చెందిన సుహాస్ ధీరజ్ పాల్గొంటున్నట్లు కోచ్ శుక్రవారం తెలిపారు. జాతీయ స్థాయి ఫుట్బాల్ సబ్ జూనియర్ పోటీలకు సంబంధించి ఆంధ్రరాష్ట్ర జట్టుకు సుహజ్ ధీరజ్ (బిక్కి) కెప్టెన్గా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గతంలో కూడా సుమజ్ధీరజ్ అండర్ –14 ఫుట్బాల్ క్రీడల్లో ఆంధ్రరాష్ట్రం తరఫున ఆడి నాయుడుపేట కీర్తిని చాటిచెప్పినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫున అండర్ 17 బాలుర విభాగంలో నేషనల్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బల్లియ పట్టణంలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టుకు కెప్టెన్గా సుహాజ్ ధీరజ్ వ్యవహరించనున్నట్టు తెలిపారు.


