వెంకటగిరి రూరల్: ఓటు వేసేందుకు వచ్చిన ఓ మహిళను అదే గ్రామానికి చెందిన వ్యక్తి కర్రతో దాడిచేసి తల పగులగొట్టిన ఘటన వెంకటగిరి మండలంలోని పారవోలు దళితవాడలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం.. పారవోలు గ్రామానికి చెందిన తూపిలి సుబ్రమణ్యం, రమణమ్మ దంపతులు పట్టణంలో నివాసం ఉంటున్నారు. స్థానిక ఎన్నికల సందర్భంగా ఓటు వేసేందుకు పారవోలు గ్రామానికి వచ్చి, ఓటు హక్కు వినియోగించుకున్న రమణమ్మపై అదే గ్రామానికి చెందిన దందవోలు ఈశ్వరయ్య కర్రతో దాడి చేసి గాయపరిచారు. వెంకటగిరి సీఐ రోశయ్య ఘటనా స్థలికి చేరుకుని నిందితుడు ఈశ్వరయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఈశ్వరయ్య తండ్రి సుబ్రమణ్యం అనే వ్యక్తి గత కొన్నేళ్ల హత్యచేశారన్న నేపంలో పాత కక్షలు మనసులో పెట్టుకుని రమణమ్మపై దాడి చేసి ఉండవచ్చని స్థానికులు తెలిపారు.


