చైన్నెలో నివాసం.. సత్యవేడులో ఓటు.. నాగలాపురం మండలంలో పోటీ | - | Sakshi
Sakshi News home page

చైన్నెలో నివాసం.. సత్యవేడులో ఓటు.. నాగలాపురం మండలంలో పోటీ

Nov 4 2026 2:32 AM | Updated on Nov 4 2026 2:32 AM

● టీడీపీ జెడ్పీటీసీ బరిలో మాజీ ఎమ్మెల్యే హేమలత ● ఆమె పోటీపై రగులుతున్న స్థానికులు ● నాగలాపురం ప్రజలంటే టీడీపీకి అంత చులకనా?

● టీడీపీ జెడ్పీటీసీ బరిలో మాజీ ఎమ్మెల్యే హేమలత ● ఆమె పోటీపై రగులుతున్న స్థానికులు ● నాగలాపురం ప్రజలంటే టీడీపీకి అంత చులకనా?

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: మాజీ ఎమ్మెల్యే హేమలత నాగలాపురం మండల టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేయడంపై స్థానికులు, అధికార పార్టీ నాయకులు రగిలిపోతున్నారు. అధిష్టానం తీరుపై ఆ పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె నివాసం ఉండేది చైన్నె కాగా ఓటు హక్కు సత్యవేడు మండలంలో ఉండగా పోటీ చేస్తున్నది మాత్రం నాగలాపురం మండలం కావడం విశేషం. గతంలో ఆమె ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండరనేది చర్చనీయాంశంగా మారింది. అలాంటి పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం నాగలాపురం మండల జెడ్పీటీసీ సీటు కేటాయించడంపై అటు మండల ప్రజలు, ఇటు అధికార పార్టీ నాయకుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏనిమిది పదుల వయసు దాటి ఉన్న ఆమె మండల ప్రజలకు ఏ మేరకు అందుబాటులో ఉంటుంది, ప్రజాసమస్యల పట్ల ఆమెకు ఎంతమాత్రం అవగాహన కలుగుతుంది, వాటి పరిష్కారానికి ఆమెకు స్పందించే సమయం ఉంటుందా? అన్న ప్రశ్నలు ప్రస్తుతం నాగలాపురం మండల ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. జెడ్పీ చైర్‌పర్సన్‌ రేస్‌లో ఉన్న ఆమె ఏకంగా పిచ్చాటూరు, నాగలాపురం, సత్యవేడు, వరదయ్యపాళెం మండలాల్లో ఆరు సెట్ల నామినేషన్లను టీడీపీ, జనసేన పార్టీల నుంచి దాఖలు చేశారు. అనూహ్యంగా చివరి దశలో నాగలాపురం జెడ్పీటీసీగా ఆమెకు అధిష్టానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఆ మండలంలో ఆది నుంచి పార్టీని నమ్ముకున్న ఆశావహులకు నిరాశే మిగిలింది. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ స్థానికంగా ఉన్న సీనియర్‌ నాయకుడు చిన్నదొరైకు జెడ్పీటీసీ సీటును కేటాయించింది. అయితే అధికార పార్టీ మాత్రం అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యేకు సీటు కేటాయించడం పట్ల ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ గెలిపిస్తే సమస్యల పరిష్కారం కోసం మండల ప్రజలు ఎక్కడికెళ్లి వెతుక్కోవాలా..? అని చర్చించుకుంటున్నారు. దీనిపై ఓటర్లు ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement