తిరుపతి సిటీ: స్థానిక కరకంబాడి రోడ్డులోని ఎస్వీసీఈ కళాశాల మేనేజ్‌మెంట్ స్టడీస్ విభాగం ఆధ్వర్యంలో డీఎస్‌టీ ప్రాయోజిత మహిళా పారిశ్రామికవేత్తల అభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు అవసరమైన వ్యాపార పరిజ్ఞానం, పారిశ్రామిక నైపుణ్యాలు, ప్రోత్సాహకం వంటి ప్రముఖ అంశాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నాలుగు వారాల పాటు కొనసాగించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. అనంతరం సంస్థాగత సహకారానికి, పారిశ్రామికాభివృద్ధికి అమెరికాలోని ఆస్టిన్‌కు చెందిన సురక్ష సంస్థతో ఎస్వీసీఈ పలు అంశాలపై ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే ఎస్వీయూ రూసా ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్‌తో ఎల్‌ఓఎల్ మార్పిడి చేసుకున్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, రూసా సీఈఓ వంశీకృష్ణ, టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ విజయవంత్ మాథూర్, సురక్ష సంస్థ వ్యవస్థాపకులు ప్రసాద్ జలది, డాక్టర్ నీరజ, డాక్టర్ సాయిలక్ష్మి, మహిళా పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.


