తిరుపతి రూరల్: శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో సోమవారం నర్సింగ్ విద్యార్థినులకు జర్మన్ భాషపై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన కర్నూలు ప్రాంతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ శిక్షణశాఖ అధికారి టి.శ్రీనివాస్ మాట్లాడుతూ జర్మన్ భాషపై నిర్వహించే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. విదేశాల్లో ఉన్నత విద్యతో పాటు మెరుగైన ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకునేందుకు భాషా నైపుణ్యం ఎంతో అవసరమన్నారు. వీసీ ఆచార్య ఉమ, రిజిస్ట్రార్ ఆర్.ఉష, డీన్ పి.విజయలక్ష్మి, జర్మన్ భాష శిక్షకుడు శుభమ్‌సింగ్, స్కూల్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ గంగాభవాని పాల్గొన్నారు.


