తిరుపతి సిటీ: ఎస్వీయూలో అధికారుల తీరు దారుణంగా ఉందని, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాలు 9 నెలలు గడుస్తున్నా విడుదల చేయకపోవడం దారుణమని ఏఐఎస్‌ఎఫ్ నేతలు మండిపడ్డారు. ఈ మేరకు వారు సోమవారం వర్సిటీలో ధర్నా నిర్వహించి ఎగ్జామినేషన్ డీన్ ప్రొఫెసర్ సురేంద్రబాబు, రెక్టార్ చండ్రాయుడును కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సమతి సభ్యులు చిన్నా, క్యాంపస్ అధ్యక్షుడు రవియాదవ్ మాట్లాడారు. ఈ విషయంపై రెక్టార్ చెండ్రాయుడు స్పందిస్తూ ఈనెల 5వ తేదీ లోపు మొదటి సెమిస్టర్ ఫలితాలు, అలాగే రెండో సెమిస్టర్ ఫలితాలు 10వ తేదీ లోపు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఏఐఎస్‌ఎఫ్ నాయకులు వేణు, దినేష్, చరణ్, సిద్ధు, వంశీ, శివ శంకర్ పాల్గొన్నారు.
కుస్తీ పోటీల్లో ఎస్పీడబ్ల్యూ విద్యార్థినుల ప్రతిభ
తిరుపతి సిటీ: పల్నాడు జిల్లాలో గత నెల 9 నుంచి నాలుగురోజుల పాటు జరిగిన 70వ ఎస్‌జీఎఫ్ అంతర్ జిల్లాల బాలికల అండర్–17 కుస్తీ చాంపియన్‌షిప్ పోటీల్లో శ్రీపద్మావతి మహిళా జూనియర్ కళాశాల విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. సోమవారం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భువనేశ్వరి ప్రతిభ చూపిన విద్యార్థినులు లావణ్య, మానస, నాగభవ్యశ్రీ, మునీశ్వరి, జశ్విత, అనంతలక్ష్మిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ సాయిసుమతి, అధ్యాపకులు పాల్గొన్నారు.
బస్సు, కారు ఢీ
– ఒకరి దుర్మరణం
సూళ్లూరుపేట: సూళ్లూరుపేట నుంచి శ్రీహరికోటకి వెళ్లేరోడ్డు ఫ్లైఓవర్ బ్రిడ్జి మీద ఆదివారం అర్ధరాత్రి ప్రయివేట్ బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో కారులో ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాద తీవ్రతకు కారు నామరూపాల్లేకుండా ముక్కలైపోయింది. కారు నడుపుతున్న సూళ్లూరుపేటలోని గోల్డెన్ జిమ్ యజమాని మురళి అక్కడికక్కడే మృతి చెందాడు. రోడ్డుపై చాలాసేపు ట్రాపిక్ జామ్ అయ్యింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రోడ్డుపై చెల్లా చెదురుగా పడివున్న కారు శిథిలాలను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. కేసు దర్యాప్తులో ఉంది.
ఎన్నికల ప్రకటనలపై పరిశీలన
తిరుపతి అర్బన్: కలెక్టరేట్‌లో ఎన్నికల ప్రకటనలను పరిశీలించి నమోదు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు పలు చానళ్లలో ఇస్తున్న ప్రచార ప్రకటనలను సమాచారశాఖ ఉద్యోగులు లెక్కలు కడుతున్నా రు. ఏ పార్టీకి చెందిన అభ్యర్థులు ఎలాంటి ప్రకటనలు, రోజువారీలో ఎన్నిసార్లు ఇస్తున్నారనే అంశాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రకటనలు ఖర్చుల వ్యవహారాలను నమోదు చేసుకుంటున్నారు.
రాష్ట్ర స్థాయి వాలీబాల్
పోటీలకు ఎంపిక
తొట్టంబేడు (శ్రీకాళహస్తి రూరల్): తొట్టంబేడు మండలం, పెద్ద కనపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ఎస్‌కె.షర్మిల అండర్ 14 బాలికల విభాగంలో వాలీబాల్ క్రీడలో రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్టు హెచ్‌ఎం పీ.సుబ్రమణ్యం, వ్యాయామ ఉపాధ్యాయులు ఎం.చంగల్‌రాయులు తెలిపారు. అంజూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో ఆమె ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు వారు పేర్కొన్నారు. ఎంపికై న విద్యార్థినిని ఉపాధ్యాయులు ప్రసాద్, పౌజియా, నాగరాజు, మునుస్వామి, గోపాల్ జరీనా, సరిత, స్కూల్ కమిటీ చైర్మన్ చలపతి అభినందించారు.


