విద్యుదాఘాతంతో గిరిజన బాలుడి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో గిరిజన బాలుడి మృతి

Nov 3 2026 2:09 AM | Updated on Nov 3 2026 2:09 AM

వరదయ్యపాళెం: రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబంలో పుట్టడమే ఆ పసివాడి పాలిట శాపమైంది. చదువుకోవాల్సిన వయసులో పొట్టకూటి కోసం కూలికి వెళ్లి, విద్యుత్‌ తీగలకు బలైపోయాడు. వరదయ్యపాళెం మండలం గోవర్దనపురానికి చెందిన గిరిజనుడు సురేష్‌ కుమారుడు మదన్‌ (14) తల్లిదండ్రులకు చేదోడుగా ఉండాలని చిన్న వయసులోనే కూలిలీ పనులకు వెళ్తున్నాడు. సోమవారం గోవర్దనపురం హైస్కూల్‌ దారిలోని ఓ కల్యాణ మండపం వద్ద పెళ్లి లైటింగ్‌ కోసం గుంజలు పాతుతున్నాడు. అంతలోనే రోడ్డు పక్కనే వేలాడుతున్న 11 కేవీ విద్యుత్‌ తీగలు మదన్‌ ప్రాణం తీశాయి. గుంజ తీగకు తగలగానే ఒక్కసారిగా కరెంట్‌ షాక్‌తో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు వదిలాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మల్లికార్జున తెలిపారు.

విద్యుత్‌ షాక్‌తో యువకుడి మృతి

కలువాయి(సైదాపురం): విద్యుత్‌షాక్‌తో ఓ యువకుడు మృతిచెందిన ఘటన కలువాయి మండలంలోని కేసీగోపవరం వద్ద సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం.. మండలంలోని దాచూరు గ్రామానికి చెందిన బైరుపోగు గణేష్‌(27) విద్యుత్‌ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా విద్యుత్‌ షాక్‌ గురై పైనుంచి కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

కలెక్టరేట్‌లో 23 చోట్ల సీసీ కెమెరాలు

తిరుపతి అర్బన్‌: కలెక్టరేట్‌లో 23 చోట్ల సీసీ కెమెరాల పనితీరును మెరుగుపరిచారు. అలాగే ఎవరు వస్తున్నారు.. ఎవరు వెళుతున్నారు అనే అంశాలపై ప్రత్యేక సిబ్బందితో నిఘా పెట్టారు. ఎన్నికల నేపథ్యంలోనే సీసీ కెమెరాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. డీఆర్వో చాంబర్‌కు వెళ్లే మార్గంలో ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా మొత్తం పరిశీలన చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement