పోలింగ్‌ పరేషాన్‌! | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ పరేషాన్‌!

Nov 3 2026 2:09 AM | Updated on Nov 3 2026 2:09 AM

● జెడ్పీ కార్యాలయం కలెక్టరేట్‌లో.. జెడ్పీ ఎన్నికల కార్యకలాపాలు డీఆర్‌డీఏ వద్ద ● కోడూరు, వాకాడు, చిట్టమూరు వాసుల అవస్థలు

తిరుపతి అర్బన్‌: అధికారుల అనాలోచిత విధానాలు సిబ్బందిని ముప్పుతిప్పలు పెడుతున్నాయి. జిల్లా పరిషత్‌ కార్యాలయాన్ని కలెక్టరేట్‌లో నిర్వహిస్తుండగా.. పరిషత్‌ ఎన్నికలకు సంబంధించిన కార్యకలాపాలు మొత్తం డీఆర్‌డీఏ వద్దే నడుపుతున్నారు. అయితే ఈ సమాచారం రైల్వేకోడూరు నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన నేతలు, కార్యకర్తలకు, అలాగే వాకాడు, చిట్టమూరు, వెంకటగిరి నియోజకవర్గంలోని బాలాయపల్లి, డక్కిలి మండలాలకు చెందిన వారికి సరైన సమాచారం లేకపోవడంతో ముందుగా అంతా కలెక్టరేట్‌లోని జెడ్పీ కార్యాలయానికి వెళుతున్నారు. అక్కడ జెడ్పీ సీఈవో చాంబర్‌కు తాళం వేసి ఉండడంతో.. మళ్లీ డీఆర్‌డీఏకు వస్తున్నారు. ప్రధానంగా అన్ని పార్టీలకు చెందిన వారు ఏజెంట్లుగా పనిచేయడానికి జెడ్పీ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంది. అలాగే ఎన్నికల సమయంలో వాడే వాహనాలు, ఎన్నికల ప్రచార సామగ్రి తదితర వాటి అనుమతుల కోసం అధికారులను కలవడానికి కలెక్టరేట్‌కు వెళ్లి...ఆ తర్వాత డీఆర్‌డీఏకి వస్తున్నారు.

నామినేషన్ల వరకు మాత్రమే డీఆర్‌డీఏ

కలెక్టరేట్‌లోని జెడ్పీ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు సౌకర్యం లేదని.. దాంతో నామినేషన్ల వరకు మాత్రమే డీఆర్‌డీఏలో నిర్వహిస్తామని గతంలో అధికారులు ప్రకటించారు. అయితే నామినేషన్ల ప్రక్రియ ముగిసినప్పటికీ ఎన్నికల వ్యవాహాలు మొత్తం డీఆర్‌డీఏ నుంచి నడుపుతున్నారు. అలా చేయడంలో తప్పులేదుగానీ అయితే జెడ్పీ అధికారులు తమ కార్యాలయాన్ని ఎక్కడ నిర్వహిస్తున్నారనే సమాచారాన్ని జిల్లా ప్రజలకు తెలియజేయకపోవడంపై పలువురు విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement