శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి మున్సిపాలిటీలోని 44 వార్డులకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారయ్యాయి. చైర్మన్ గిరి బీసీ జనరల్‌కు కేటాయించారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా జనరల్, అనన్‌రిజర్వ్‌డ్ విభాగాల వారీగా వార్డులను కేటాయించారు. ఇందులో బీసీలకు అత్యధికంగా 17 స్థానాలు కేటాయించగా, మహిళలకు మొత్తం 22 వార్డులు కేటాయించారు.
రిజర్వేషన్ల వివరాలు
ఎస్టీ జనరల్ కేటగిరీకి ఒక వార్డును కేటాయించారు. 21వ వార్డు ఎస్టీ జనరల్‌కు రిజర్వు చేశారు. ఎస్సీలకు మొత్తం నాలుగు స్థానాలు కేటాయించగా, వాటిలో మహిళలకు రెండు వార్డులు (3, 35), జనరల్‌కు రెండు వార్డులు (1, 4) కేటాయించారు. బీసీలకు మొత్తం 17 స్థానాలు కేటాయించారు. ఇందులో మహిళలకు ఎనిమిది వార్డులు (6, 7, 10, 11, 13, 23, 24, 43), జనరల్‌కు తొమ్మిది వార్డులు (8, 17, 25, 33, 36, 37, 39, 40, 41) కేటాయించారు. మహిళా జనరల్ కేటగిరీకి 12 వార్డులు (9, 12, 14, 15, 16, 18, 22, 26, 29, 32, 42, 44) రిజర్వు చేశారు. అనన్‌రిజర్వ్‌డ్ కేటగిరీలో పది వార్డులు (2, 5, 19, 20, 27, 28, 30, 31, 34, 38) ఉన్నాయి.
రిజర్వేషన్ల కేటాయింపులు పూర్తవడంతో ఆయా వార్డుల్లో పోటీ చేసేందుకు ఆశావహులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.


