రేపు నాయకత్వ అవకాశం | - | Sakshi
Sakshi News home page

రేపు నాయకత్వ అవకాశం

Nov 1 2026 8:07 AM | Updated on Nov 1 2026 8:07 AM

● కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారికే ప్రాధాన్యం ● పార్టీకి నష్టం చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించం ● మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

నిబద్ధతతో పని చేసినవారికే..

చంద్రగిరి:పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు నిబద్ధతతో పనిచేసి, పార్టీకి అండగా నిలిచిన వారికే భవిష్యత్తులో నాయకత్వ అవకాశాలు కల్పిస్తామని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్పష్టం చేశారు. చంద్రగిరిలోని వైఎస్‌ఎంఆర్‌ కల్యాణ మండపంలో శనివారం చంద్రగిరి మండల నాయకు లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో పార్టీకి, బరిలో నిలిచిన అభ్యర్థులకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. పార్టీకో సం నిలబడకుండా తప్పించుకు తిరిగే వారికి భవిష్యత్తులో నాయకత్వ బాధ్యతలు ఉండవని తేల్చిచెప్పా రు. నవంబర్‌ 5న జరగనున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో దోబూచులాడుతూ పార్టీకి, అభ్యర్థులకు నష్టం కలిగించేలా వ్యవహరించే వారిని భవిష్యత్తులో నాయకులు గా గుర్తించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు సొంత మండలమైన చంద్రగిరిలో గత పాతికేళ్లుగా ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంటూ వస్తోందని, ఈసారి కూడా అదే విజయ పరంపరను కొనసాగించేలా ఎంపీపీ అభ్యర్థి మల్లం దీపికారెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి కొటాల పద్మజ విజయానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని కోరారు. పోలింగ్‌ రోజున ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన బూత్‌లలో అప్రమత్తంగా ఉండాలని, పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండల పార్టీ ముఖ్య నాయకులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement