కీచక టీచర్‌పై పోక్సో కేసు నమోదు చేయండి | - | Sakshi
Sakshi News home page

కీచక టీచర్‌పై పోక్సో కేసు నమోదు చేయండి

Nov 1 2026 8:07 AM | Updated on Nov 1 2026 8:07 AM

వెంకటగిరి(సైదాపురం): పట్టణంలోని బొప్పాపురం సమీపంలో ఉన్న కేంద్రియ విద్యాలయంలో ఇంటర్మీడియట్‌ చదువుకుంటున్న ఓ విద్యార్థిని పట్ల ఫిజిక్స్‌ పీజీటీ ఉపాధ్యాయుడు అన్నపురెడ్డి సురేష్‌ లైగింగ వేధింపులకు పాల్పడడం దారుణమని, వెంటనే అత నిపై పోక్సో కేసు నమోదు చేయాలని విద్యార్థి ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. విద్యార్థినులకు సద రు అధ్యాపకుడు అసభ్యకరమైన సందేశాలు పంపడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలకు పాల్పడడంతోపాటు లైగింగ వేధింపులకు గురి చేయడం బాధాకరమన్నారు.

గుర్తు తెలియని మహిళ దారుణ హత్య

తిరుపతి రూరల్‌: గుర్తుతెలియని మహిళ దారుణ హత్యకు గురైన ఘటన తిరుపతి రూరల్‌ మండలంలో కలకలం రేపింది. సి. మల్లవరం జాతీయ రహదారి సమీపంలోని ఇటుక బట్టీల వద్ద మహిళ మృతదేహం వెలుగుచూసింది. సుమారు 30 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉన్న మహిళ మృతదేహాన్ని శనివారం స్థానికులు గుర్తించారు. మహిళ తలపై బండరాయితో మోది చంపడంతో ముఖం గుర్తుపట్టలేని విధంగా ఉంది. మృతురాలికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లేక పోవడం, ముఖం గుర్తుపట్టలేని స్థితిలో ఉండడంతో క్లూస్‌ టీంను రంగంలోకి దించారు. సి.మల్లవరం నుంచి తిరుపతి వైపు వెళ్లే మార్గంలో రహదారికి ఎడమవైపున ఉన్న ఇటుక బట్టీల సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement