మేము సైతం! | - | Sakshi
Sakshi News home page

మేము సైతం!

Nov 1 2026 8:07 AM | Updated on Nov 1 2026 8:07 AM

● తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు

● తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు

చంద్రగిరి: అర్నబ్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా, మారుటేరు ప్రాంతంలో ప్రజలకు సహాయ సహకారాలు అందించేందుకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని ఎస్వీ వ్యవసాయ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు సుమారు 88 మంది తిరుపతి నుంచి తరలివెళ్లారు. మారుటేరు ప్రాంతానికి చేరుకుని, తుపాను కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టారు.

వైఎస్సార్సీపీలో చేరిక

తిరుపతి రూరల్‌: తిరుపతి రూరల్‌ మండలం, కుంట్రపాకం పంచాయతీ, నాగూర్‌ కాలనీకి చెందిన టీడీపీ సీనియర్‌ నేత సుబ్బయ్య శనివారం వైఎస్సార్సీపీలో చేరారు. జెడ్పీటీసీ అభ్యర్థి చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగూర్‌ కాలనీకి వెళ్లగా.. ఆ సమయంలో టీడీపీలో సీనియర్‌ నాయకునిగా ఉన్న సుబ్బయ్య పార్టీలో చేరారు. చెవిరెడ్డి కుటుంబం పట్ల అపారమైన అభిమానం, ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాలను తట్టుకోలేకనే సుదీర్ఘ కాలంపాటు కొనసాగిన తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టినట్టు ఆయన స్పష్టం చేశారు. చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఆయనకు వైఎస్సార్సీపీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం స్థానిక వైఎస్సార్సీపీ నేతలతో కలసి ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు.

అట్టహాసంగా ముగిసిన ‘మోహన మంత్ర’

చంద్రగిరి: మోహన్‌బాబు యూనివర్సిటీలో రెండు రోజుల పాటు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన జాతీయ స్థాయి టెక్నో–కల్చరల్‌ ఫెస్ట్‌ ‘మోహన మంత్ర’ శనివారం ఘనంగా ముగిసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వేలాదిమంది విద్యార్థులు తరలివచ్చి ఈ వేడుకను ఆస్వాదించారు. ఈ ఉత్సవాల సందర్భంగా వెలుపలి ప్రాంతాల నుంచి దాదాపు 10 వేలకు పైగా ఎంట్రీలు నమోదు కాగా, పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు రూ.లక్షకు పైగా నగదు బహుమతులను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement