భానుప్రకాష్‌ బ్రాహ్మణ వ్యతిరేకి | - | Sakshi
Sakshi News home page

భానుప్రకాష్‌ బ్రాహ్మణ వ్యతిరేకి

Nov 1 2026 8:07 AM | Updated on Nov 1 2026 8:07 AM

భానుప్రకాష్‌రెడ్డి బ్రాహ్మణులకు చేసిన అన్యాయాన్ని మరచిపోవద్దు

బీజేపీ కమలం గుర్తుకు ఓటు వేయకండి అంటున్న బ్రాహ్మణులు

భాను ప్రకాష్‌కు బుద్ధి చెప్పాలని వాట్సాప్‌ గ్రూప్‌ల్లో ప్రచారం

సాక్షి, తిరుపతి: బీజేపీ నేత, టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్‌రెడ్డి బ్రాహ్మణులకు చేసిన అన్యాయాన్ని గుర్తుంచుకొని ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని బ్రాహ్మణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భానుప్రకాష్‌రెడ్డి కుమారుడు పృథ్విరెడ్డి తిరుపతి 52 డివిజన్‌లో కూటమి తరఫున పోటీ చేస్తున్న సందర్భంలో ఈ ప్రకటనలు రావడం తీవ్ర చర్చకు దారితీశాయి. తమ వర్గానికి జరిగిన ద్రోహాన్ని బ్రాహ్మణులు ఓటు వేసేటప్పుడు ఆలోచించి కమలం గుర్తుకు ఓటు వేయకండి అని బ్రాహ్మణ వాట్సాప్‌ గ్రూప్‌లలో పిలుపునిస్తున్నారు. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌కు టీటీడీ బోర్డులో ఎక్స్‌ అఫిషియో సభ్యుడిగా అవకాశం ఉండేదని, భాను ప్రకాష్‌రెడ్డి వేసిన పిల్‌ ద్వారా కోర్టు ఉత్తర్వులు రావడంతో టీటీడీలో బ్రాహ్మణ ప్రతినిఽధికి సభ్యత్వం పోయిందని ఆరోపిస్తున్నారు. మరోవైపు 52 వార్డులో బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో ఉన్నా వారికి దక్కాల్సిన అవకాశాన్ని ఏమాత్రం అనుభవం లేని తన కుమారుడికి తెచ్చుకొని తమకు అన్యాయం జరిగిందని వాపోతున్నారు. 52 వార్డులో సుమారు 1,800 మంది బ్రాహ్మణ ఓటర్లు ఉన్నారని, వారికి జరిగిన అన్యాయాన్ని ఓటుతో బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గరుడ వారధిని అడ్డుకునేందుకు కోర్టులో కేసులు వేసిన భానుప్రకాష్‌ కుమారుడికి ఓటు వేయాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. వారసత్వ రాజకీయాలతో టీడీపీలోని సీనియర్‌ నాయకులకు అన్యాయం చేసి సీటు తెచ్చుకున్నారని ఆరోపిస్తున్నారు. బీజేపీకి సైతం భాను చేసింది ఏమీ లేదని సొంతపార్టీ నేతలే వాపోతున్నారని, తానొక్కడే ఎదుగుతూ పార్టీలో ఎవరినీ ఎదగనివ్వడం లేదంటూ తిరుపతిలో పోస్టర్లు వేయడం కలకలం లేపుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement