– 8లో
న్యూస్‌రీల్
టీడీపీ తొత్తులుగా కొందరు పోలీసులు
పచ్చపైత్యంతో ఖాకీల క్రౌర్యం
అధికార పార్టీ అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు
వైఎస్సార్‌సీపీ నేతలపై తీవ్రమైన వేధింపులు
తాజాగా నాయుడుపేటలోని ఓ నేత ఇంట్లో మద్యం ఉంచి కేసు నమోదు
తిరుమల ఘాట్‌లో శుక్రవారం సుమో బోల్తా పడింది. క్షతగాత్రులను అశ్వని ఆస్పత్రికి తరలించారు.
శనివారం శ్రీ 31 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
సాక్షి టాస్క్‌ఫోర్స్ : సూళ్లూరుపేట నియోజకవర్గంలో కొందరు పోలీసులు ఖాకీ యూనిఫామ్ పరువు తీసేస్తున్నారు. ‘పచ్చ’ పోలీసుల్లా వ్యవహరిస్తున్నారు. టీడీపీ నాయకులకు తొత్తులుగా మారి వైఎస్సార్‌సీపీ నేతలను వేధిస్తూ, కేసులు నమోదు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు విడుదల చేసిన నియమాళిని ఒక వైపు మైకులు పెట్టి ప్రచారం చేస్తూనే మరోవైపు వారే నిబంధనలను తుంగలో తొక్కేస్తున్నారు. ఎన్నికల సమయంలో పోలీస్ వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్‌లో పనిచేయాల్సి ఉంది. అయితే పలువురు పోలీసులు మాత్రం అధికారపార్టీ నాయకుల కనుసన్నలలో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రధానంగా నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో సీఐలు మురళీక్షృష్ణ, వెంకటరమణ, ఎస్‌ఐలు అజయ్‌కుమార్, కొండపనాయుడు టీడీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని వైఎస్సార్‌సీపీ నేతలు, అభ్యర్థులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు.
సూళ్లూరుపేటలోనూ ఇంతే..
సూళ్లూరుపేటలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్ వేయనీకుండా పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు దారుణంగా వ్యవహరించారు. నామినేషన్ కేంద్రం పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉన్నప్పటికీ పచ్చమూక గుంపులు గుంపులుగా చుట్టుముడుతున్నప్పటకీ పోలీసులు పూర్తిగా సహకరించారు. రెండోరోజున నామినేషన్ వేయడానికి వైఎస్సార్‌సీపీ నేతలు వస్తే టీడీపీ శ్రేణులపై దాడికి వచ్చారని కలరింగ్ ఇచ్చి అరెస్ట్ చేశారు. ఈ మేరకు పోలీసులు కుట్రపూరితంగా వ్యవహరించి వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ అల్లూరు అనిల్ కుమార్ రెడ్డి, నేతలు మీజూరు రామకృష్ణారెడ్డి, జెట్టి వేణుయాదవ్, బద్దెపూడి మోహన్‌రెడ్డి, వాకాటి బాబురెడ్డి, చిలకా యుగంధర్‌ను అరెస్ట్ చేసి దొరవారిసత్రం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమలోనే సూళ్లూరుపేట మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీమంత్‌రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. మండలంలోని మొత్తం 9 ఎంపీటీసీ స్థానాల్లో 7 కూటమికి, రెండు వైఎస్సార్‌సీపీ ఇస్తామని పోలీసులే మధ్యస్తానికి రావడం గమనార్హం. ఈ ప్రతిపాదనకు ఒప్పుకోకపోతే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని భయభ్రాంతులకు గురి చేశారు. అలాగే జెడ్పీటీసీ స్థానానికి సైతం నామినేషన్ వేయకూడదని పోలీసులే హుకుం జారీ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను నాయుడుపేటలోని క్యాంపు కార్యాలయంలో డీఎస్పీ చెంచుబాబు, సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలో హౌస్ అరెస్ట్ చేశారు. నాయుడుపేట. మండలం పూడేరు సెగ్మెంట్‌కు నామినేషన్ వేయడానికి వచ్చిన మాజీ ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి చేతిలోని పత్రాలను టీడీపీ గుండాలు తీసుకుని చించివేస్తుంటే పోలీసులే అండగా నిలిచారు. పెళ్లకూరు మండలం కలవకూరుతో పాటు ఆరు సెగ్మెంట్లకు నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన అభ్యర్థులను బెదిరించి వెనక్కి పంపించేశారు. నామినేషన్ కేంద్రాల్లోకి టీడీపీ నేతలు చెప్పిన వారినే పోలీసులు పంపించారు. ఈ తరహాలోనే తడ జెడ్పీటీసీ స్థానానికి పోటీచేసిన కె.ఆర్ముగం, కొళవి మురుగన్‌పాటు వైఎస్సార్‌సీపీ నేతలు కె.నందారెడ్డి, పి.రమేష్‌రెడ్డి, తిరుమలైరెడ్డిని పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. నాలుగు స్థానాలను మీకు ఇప్పిస్తాం. తొమ్మిది ఎంపీటీసీ స్థానాలను టీడీపీకి ఇచ్చేయండి అంటూ హుకుం జారీ చేశారు. అలాగే జెడ్పీటీసీ నామినేషన్‌లను కూడా ఉపసంహరించుకోకుంటే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ నేతల కనుసన్నల్లో ‘పచ్చ’పాతంతో పనిచేస్తున్న పోలీసులను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్వర్‌కు సైతం ఫిర్యాదు చేశారు.
పెళ్లకూరు మండలం కలవకూరు వద్ద స్వర్ణముఖినదిలో ఇసుక దోపిడీ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. క్షేత్రస్థాయిలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నారు. అయితే ఇసుక దొంగలను వదిలేసి అక్రమ రవాణాను అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ నేతలనే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఇటీవల కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి తన పొలానికి కంచె వేసుకుంటూ ఉంటే టీడీపీ నేతలు ఘర్షణకు దిగారు. వివాదాలను సృష్టించి గొడవ చేస్తుండగా ఓ వ్యక్తి మరణించాడు. అయితే నేరాలనికి పాల్పడిన పచ్చమూకను వదిలేసి సత్యనారాయణరెడ్డిపై కేసు పెట్టి జైలుకు పంపించారు.
నాయుడుపేట సీఐ తురక వెంకటరమణ వ్యవహారశైలి ఆది నుంచి వివాదాస్పదమే. తనను తాను గబ్బర్ సింగ్ అంటూ చెప్పుకునే వెంకటరమణపై ఈ ఏడాది ఏప్రిల్‌లో సస్పెన్షన్ వేటు పడింది. ప్రేమ వివాహం చేసుకున్న చౌడేశ్వరి అనే యువతి మర్డర్‌ను ఆత్మహత్యగా చిత్రీకరించారు. పోస్టుమార్టం రిపోర్టులో సీఐ వెంకటరమణ బండారం బయటపడింది. ఆయనను కావాలనే టీడీపీ నేతలు నాయుడుపేటకు రప్పించి అర్బన్ సీఐగా పోస్టింగ్ ఇప్పించినట్లు ప్రచారం నడుస్తోంది.
ఫిర్యాదు చేసిన వారిపైనే..
నేనే గబ్బర్ సింగ్
ఖాకీ దుస్తుల విలువను కొందరు పోలీసులు వలిచేస్తున్నారు. అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతూ దారుణంగా వ్యవహరిస్తున్నారు. పచ్చమూక పైత్యానికి తమ క్రౌర్యం జతచేస్తున్నారు. అక్రమాలను ప్రశ్నించిన వారిపైనే కేసులు నమోదు చేసి హింసిస్తున్నారు. స్థానిక సంస్థల
ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. పలు సినిమాల్లో చూపించినట్టు పోలీసులే దౌర్జన్యంగా వైఎస్సార్‌సీపీ నేతల ఇంట్లో మద్యం పెట్టి కేసు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారు.


