రేణిగుంట : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అందించిన సంక్షేమ పథకాలే బలంగా, గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుదామని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని కృష్ణాపురం నుంచి వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి గంగారి సుజాత, ఎంపీటీసీ అభ్యర్థులు నాగరాజు, హేమలత, దిలీప్‌లతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎస్‌యూ పురం, ఆర్.మల్లవరం, గుత్తివారిపల్లి, వెదళ్లచెరువు, మామండూరు, చైతన్యపురం, సీఆర్ నగర్, గుండ్రాల కాలువ, శ్రీనివాసపురం, బీసీ కాలనీ ఇంద్రానగర్, దొడ్ల మిట్ట దళితవాడ, రాజీవ్ గాంధీ కాలనీ, గొల్లపల్లి, చెంగారెడ్డిపల్లిల్లో ఇటింటి ప్రచారం చేపట్టారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. డీసీసీబీ మాజీ చైర్మన్ సిద్ధగుంట సుధాకర్ రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు తిరుమలరెడ్డి, సంధ్య, మాజీ ఎంపీపీ హరి ప్రసాద్ రెడ్డి, నేతలు శ్రీధర్ రెడ్డి, ముద్దు రాయలు, రవి, బంగారమ్మ, మహదేవరెడ్డి, బాబ్జీరెడ్డి, శేషారెడ్డి, వెంకట రెడ్డి, గణేష్ రెడ్డి, లోకనాథ్ రెడ్డి, ధనంజయలు, ముని రెడ్డి, మంజుల, సుబ్రమణ్యం యాదవ్, గిరి రెడ్డి, హాజీ బాషా, కడప సాహెబ్, తిరుమలేష్, ప్రసాద్, లోకేష్, మునికష్ణ, రాజేంద్ర, మురగయ్య, మునికృష్ణ, చంద్రమౌళి, లక్ష్మీనారాయణ, యుగంధర్, పురుషోత్తం, శీను యాదవ్, దయాకర్ రెడ్డి, యోగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.


