సూళ్లూరుపేట : సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని రెండో ప్రయోగవేదిక నుంచి శుక్రవారం రాత్రి 11.51 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్18 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించారు. 19.10 నిమిషాల్లోనే 2,232 కిలోలు బరువు కలిగిన నావిక్–3 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
నిప్పులు చిమ్ముకుంటూ..
కౌంట్‌డౌన్ ముగిసిన వెంటనే జీఎస్‌ఎల్‌వీ ఎఫ్–16 నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఎగిరింది. 0.00 నిమిషాలకు కోర్ అలోన్ దశలో 138.1 టన్నుల ఘన ఇంధనం, రాకెట్‌కు చుట్టూ ఉన్న నాలుగు స్ట్రాపాన్‌బూస్టర్లులో నింపిన 170.7 టన్నుల ద్రవ ఇంధనాన్ని మండిచి మొదటిదశను 151.2 సెకెండ్లకు పూర్తి చేశారు. రెండోదశను 149.6 సెకెండ్లకు మండించి 151.2 సెకెండ్లకు పూర్తి చేశారు. ఈ దశలోనే రాకెట్ శిఖరభాగంలో ఉపగ్రహాన్ని అమర్చిన హీట్‌షీల్డ్స్ 237.42 సెకెండ్లకు విడిపోయాయి. రాకెట్‌లోని మూడోదశ అంటే క్రయోజనిక్ దశను 295.68 సెకెండ్లకు మండించి 1135.38 నిమిషాలకు కటాఫ్ చేశారు. మళ్లీ 1140.38 సెకెండ్లకు క్రయోజనిక్ ఇంజిన్ మండించి 1147.38 సెకెండ్లకు) 2,232 కిలోలు బరువు కలిగిన నావిక్–3 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.


