తిరుమల : తిరుమల శ్రీవారిని శుక్రవారం పలువురు ప్రముఖులు సేవించుకున్నారు. వీరిలో ఎంపీ గురుమూర్తి, సినీ నటులు ఆది, అశ్విన్ బాబు, సంగీత దర్శకుడు తమన్ ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. టీటీడీ అధికారులు ఘనంగా లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు.
మూడో ర్యాండమైజేషన్ పూర్తి
తిరుపతి అర్బన్ : మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సిబ్బంది 3వ ర్యాండమైజేషన్ ప్రక్రియను ఎన్నికల సాధారణ పరిశీలకుడు వరప్రసాద్ సమక్షంలో పూర్తి చేసినట్లు జేసీ గోవిందరావు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోమున్సిపల్ ఎన్నికల సిబ్బంది, మైక్రో అబ్జర్వర్ల మూడో ర్యాండమైజేషన్ ప్రక్రియలో పలు అంశాలను పరిశీలించారు.
పింఛన్ల పేరిట నాటకాలు
తిరుపతి అర్బన్ : సామాజిక భద్రతా పింఛన్లు నవంబర్ 1వ తేదీన పంపినీ చేయాల్సి ఉంది. అయితే ఆ రోజు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం నుంచే పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ ఎన్నికల్లో లబ్ధి పొందడమే అజెండాగా కూటమి నేతలు రంగంలోకి దిగేశారు. పింఛన్లను తమ జేబులో నుంచి ఇస్తున్న సొమ్ముగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా 2,59,169 మందికి గాను, 90.27శాతం మందికి పంపిణీ చేశారు. తమ అభ్యర్థులకు ఓటేయాలంటూ లబ్ధిదారులను ఇబ్బందిపెట్టారు.
ఇంట్లో చోరీ
రైల్వేకోడూరు అర్బన్ : పట్టణంలోని సీతారాం నగర్‌కు చెందిన ప్రణీత్‌రెడ్డి నివాసంలో గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. దుండగులు 10 తులాల బంగారం, 3 కేజీల వెండిని అపహరించినట్లు బాధితులు శుక్రవారం ఫిర్యాదు చేశారు.


