‘పచ్చ’ ఖాకీ గూండాయిజం! | - | Sakshi
Sakshi News home page

‘పచ్చ’ ఖాకీ గూండాయిజం!

Oct 30 2026 7:18 AM | Updated on Oct 30 2026 7:18 AM

● సీఐ వెంకటరమణపై ఫిర్యాదు చేస్తాం ● మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య

నాయుడుపేట టౌన్‌: నాయుడుపేట మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని పోలీసులు ఖూనీ చేస్తున్నారని, అర్బన్‌ సీఐ వెంకటరమణ వైఎస్సార్‌సీపీ నాయకులపై గూండాయిజం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మండిపడ్డారు. స్థానికె వైఎస్సార్‌సీపీ క్యాంపు కార్యాలయం వద్ద గురువారం రాత్రి ఆయన విలేకర్లతో మాట్లాడారు. పోలీసులు టీడీపీకి తొత్తులుగా మారి ఎన్నికల బరిలో ఉన్న తమ పార్టీ అభ్యర్థుల బంధువులు, నేతలను తరచూ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి దాష్టీకం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్‌, టీడీపీ నేత గంగాప్రసాద్‌ ఆదేశాల మేరకే సీఐ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నామినేషన్లు వేసిన నాటి నుంచే అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి దౌర్జన్యకాండ చేస్తూ, వైఎస్సార్‌సీపీ పేరు చెబితే తాట తీస్తానని బెదిరిస్తూ, ఎక్కడా ప్రచారాలు చేయరాదని వార్నింగ్‌ ఇస్తూ భయానక వాతావరణం సృష్టించారన్నారు. పలువురు మహిళా అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి దుర్భాషలాడాడని, తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించి, థర్డ్‌ ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. సీఐను తక్షణమే ఎన్నికల విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. సీఐ అరాచకాలు, దౌర్జన్యాలపై ఎన్నికల అధికారులతో పాటు ఎస్పీ, డీఎస్పీ, రిటర్నింగ్‌ అధికారులకు సైతం మొరపెట్టుకున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గుండాయిజం చేస్తూ నేర చరిత్ర కలిగిన సీఐ విధుల్లో ఉంటే నాయుడుపేటలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రశాంతంగా జరగడం ఆసాధ్యమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యం బతకాలంటే రాష్త్ర ఎన్నికల సంఘం, కలెక్టర్‌, ఎస్పీ స్పందించి సీఐ వెంకటరమణపై చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. టీడీపీ దమన కాండను ప్రజలు గమనిస్తున్నారని స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించి వారికి గుణపాఠం చెబుతారని వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కామిరెడ్డి రాజారెడ్డి, నేతలు గంధవల్లి సిద్ధయ్య, జలదంకి వెంకటకృష్ణారెడ్డి, పాపారెడ్డి చంద్రారెడ్డి, దారా రవి, కావేరిపాకం అశోక్‌కుమార్‌, కింగ్స్‌వే జిలానీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement