ఏర్పేడు: డల్హౌసీ యూనివర్శిటీతో కలసి ప్రపంచస్థాయి పరిశోధనలను మరిన్ని ఆవిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తిరుపతి ఐసర్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఏర్పేడు మండలం జంగాపల్లి సమీపంలోని తిరుపతి ఐసర్‌లో బుధవారం డల్హౌసీ యూనివర్శిటీ ఇన్నోవేషన్ ఏవీపీ జెఫ్ లారెన్స్ పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు. ఆవిష్కరణ, పరిశోధన వాణిజ్యకరణలోకి ఆలోచనలను స్కేలబుల్ వెంచర్లుగా మార్చడానికి కార్యాచరణ మార్గాలను వివరించారు. డల్హౌసీ యూనివర్శిటీ క్లీన్ అగ్రికల్చర్ టెక్నాలజీ – ఎనర్జీ ప్రతినిధి డాక్టర్ సోనిల్ నంద, తిరుపతి ఐసర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అసోసియేట్ డీన్ డాక్టర్ అన్నపూర్ణ దేవి అల్లు తదితరులు పాల్గొన్నారు.


