సంక్షేమమే శ్రీరామరక్ష | - | Sakshi
Sakshi News home page

సంక్షేమమే శ్రీరామరక్ష

Oct 29 2026 2:24 AM | Updated on Oct 29 2026 2:24 AM

రేణిగుంట: వైఎస్సార్‌ సీపీ రేణిగుంట జెడ్పీటీసీ అభ్యర్థి గంగారి సుజాత, ఎంపీటీసీ అభ్యర్థులు నాగరాజు, హేమలత, దిలీప్‌ను ప్రజలు ఆదరించాలని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం కోరారు. బుధవారం రేణిగుంటలో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలతో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎన్నికలలో అనుసరించాల్సిన విధానాలపై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. వారు మాట్లాడుతూ ముందుగా టీడీపీ నుంచి ఎన్ని ప్రలోభాలు ఎదురైనా ధైర్యంగా నిలబడిన వైఎస్సార్‌సీపీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని, అలాగే టీడీపీ మోసపూరితమైన సూపర్‌ సిక్స్‌ హామీల విషయాన్ని క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని సూచించారు. రాష్ట్రంలో జగనన్న చేసిన మంచే మనకు శ్రీరామ రక్ష అని, పార్టీ కార్యకర్తలంతా ఐక్యంగా ప్రజల్లోకి వెళ్లి మన అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. డీసీసీబీ మాజీ అధ్యక్షుడు సిద్ధగుంట సుధాకర్‌ రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు తిరుమలరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు గంగారి రమేష్‌, బాబ్జి రెడ్డి, శ్రీధర్‌ రెడ్డి, గణేష్‌ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, జువ్వల దయాకర్‌ రెడ్డి, యోగేశ్వర్‌ రెడ్డి, మునిశేఖర్‌ రెడ్డి, శీను యాదవ్‌, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌, మాజీ సర్పంచ్‌ నగేషం, రహీం, శంకర్‌ రెడ్డి, ప్రకాష్‌, రసూల్‌, ఖాదర్‌ బాషా, హాసన్‌ సాహెబ్‌, పర్వీన్‌ బి, రాణి, బుజ్జమ్మ, జాన్‌ బాబు, కుట్టి, ప్రవీణ్‌, శ్రీనివాసులు, శ్రీకాంత్‌, లోహి, రమణ, సరోజమ్మ, సుబ్బమ్మ, తశీన, స్వర్ణలత, షాహిదా, అమ్ములు, రఫీ ఉల్లా, అబ్దుల్‌ ఖాదర్‌, షబ్బీర్‌, ఇరానీ ఖాదర్‌, ధర్మ, రాజేష్‌, శివకుమార్‌, పార్థసారథి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement