రాష్ట్రంలో నియంత పాలన | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో నియంత పాలన

Oct 29 2026 2:24 AM | Updated on Oct 29 2026 2:24 AM

వెంకటగిరి(సైదాపురం) : రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని, చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని ఎంపీ గురుమూర్తి స్పష్టం చేశారు. బుధవారం వెంకటగిరి పట్టణంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి బొలిగల దీవెన, ఎస్‌ఈసీ సభ్యులు బొలిగల మస్తాన్‌యాదవ్‌, కలిమిలి రాంప్రసాద్‌రెడ్డితో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 13, 15, 16, 10, 11 వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. ఎంపీ మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూలేని నీచ సంస్కృతికి చంద్రబాబు ప్రభుత్వం తెరతీసిందన్నారు. నామినేషన్లు వేసేందుకు వెళ్లిన అభ్యర్థులను అడ్డుకుని ప్రజస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని ఆరోపించారు. చివరకు ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా కూటమి నేతలు అడ్డుకుంటున్నారని విమర్శించారు. ప్రస్తుతం ఓట్లు లాక్కుంటున్నారని, రేపు ఆస్తులు లాక్కుంటారని మండిపడ్డారు. ప్రజలు ఆలోంచి వైఎస్సార్‌ీసీపీ అభ్యర్థులను బలపరచాలని కోరారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వెంకటగిరి మున్సిపాలిటీకి అత్యధిక నిధులు కేటాయించారని వెల్లడించారు. నగరవనం, సెంట్రల్‌ లైటింగ్‌ తీసుకొచ్చిన ఘనత కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానిదే అని వివరించారు. రామ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ వెంకటగిరి మున్సిపాలిటీకి సమర్ధవంతమైన చైర్‌పర్సన్‌ అభ్యర్థి బొలిగల దీవెనను గెలిపించాలని కోరారు. పార్టీ నియోజకవర్గ పరిశీలకులు కోడూరు కల్పలతరెడ్డి పాల్గొన్నారు.

అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు

తిరుపతి అర్బన్‌ : జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేస్తున్న అన్ని పార్టీల అభ్యర్థులకు వరుస సంఖ్యతో కూడిన గుర్తుల కేటాయింపు ప్రక్రియను పూర్తిచేశామని జెడ్పీ సీఈఓ శోభనబాబు బుధవారం వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ, టీడీ పీ, జనసేన, బీఎస్పీ, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం పార్టీలకు వారి గుర్తులనే ఇచ్చిన ట్లు వివరించారు. స్వతంత్ర అభ్యర్థులతోపాటు పలువురు పోటీలో ఉన్న వాళ్లకు వరుస సంఖ్యతో కూడిన వివిధ గుర్తుల కేటాయింపు చేసినట్లు స్పష్టం చేశారు.

హుండీ లెక్కింపునకు బంగారు ఆభరణాలతో అధికారి

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయం, అనుబంధ ఆలయాలకు సంబంధించి బుధవారం నిర్వహించిన హుండీ లెక్కింపునకు ఓ ఉన్నతాధికారి బంగారు ఆభరణాలు ధరించి హాజరు కావడం విమర్శలకు దారితీసింది. సదరు అధికారి ఉంగరాలు, బంగారు బ్రేస్‌లెట్‌, చైన్‌న్‌ ధరించి కౌంటింగ్‌కు వచ్చినట్లు తెలిసింది. హుండీ కౌంటింగ్‌ వంటి కీలకమైన విధుల్లో పాల్గొనే అధికారులు విధివిధానాలు, నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఇతర ఆలయం నుంచి వచ్చిన సదరు అధికారికి స్థానిక ఉన్నతాధికారులు తగిన సూచనలు చేయాల్సి ఉన్నప్పటికీ, ఈ విషయంలో పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement