ఎన్నికల విధుల్లో అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల విధుల్లో అప్రమత్తం

Oct 29 2026 2:24 AM | Updated on Oct 29 2026 2:24 AM

తిరుపతి క్రైమ్‌ : శిక్షణ పూర్తి చేసుకుని వచ్చిన నూతన కానిస్టేబుళ్లు ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో 207 మంది నూతన కానిస్టేబుళ్లతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో నూతన సిబ్బందిని అనుభవజ్ఞులైన పోలీసులతో కలిపి బృందాలుగా ఏర్పాటు చేసి విధుల్లో నియమిస్తామని తెలిపారు. ఎన్నికల బందోబస్తులో సమన్వయంతో పనిచేస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ అంకితభావంతో వ్యవహరించాలని సూచించారు. పోలీస్‌ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించకూడదని, సామాజిక మాధ్యమాల వినియోగంలోనూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. విధులకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోకుండా, వ్యక్తిగత జీవితంలోనూ క్రమశిక్షణ పాటించాలని స్పష్టం చేశారు. హెల్మెట్‌ లేకుండా వాహనాలు నడపడం, ర్యాష్‌ డ్రైవింగ్‌ వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలన్నారు. నూతన సిబ్బందికి అవసరమైన వసతి, సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సిబ్బంది సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ విధుల నిర్వహణకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ పోలీస్‌ శాఖపై విశ్వాసాన్ని పెంపొందించేలా పనిచేయాలని కానిస్టేబుళ్లకు స్పష్టం చేశారు. అదనపు ఎస్పీలు శ్రీనివాసులు, శ్రీనివాసరావు, ఏఓ సురేష్‌ బాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement