వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నేత | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నేత

Oct 29 2026 2:24 AM | Updated on Oct 29 2026 2:24 AM

తిరుపతి మంగళం:టీడీపీని ప్రాణంగా, ఊపిరిగా బావించి 30 ఏళ్లుగా భుజాలు అరిగేలా జెండా మోసిన తమకు జేబీ శ్రీనివాస్‌ పార్టీ నగర ఇన్‌చార్జి అయిన తర్వాత గుర్తింపు లేకుండా పోయిందని టీడీపీ నేత కొండారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి 13వ డివిజన్‌ అధ్యక్షుడిగా ఎమ్మార్‌పల్లె ప్రాంతంలో ప్రజలకు అనేక సేవలందించినప్పటికీ తమకు కాకుండా రౌడీలకు కార్పొరేటర్‌ సీట్లు ఇచ్చారని మండిపడ్డారు. దీంతోనే టీడీపీలో మనుగడ సాగించలేక, విలువలు, గుర్తింపు లేనిచోట ఉండలేక వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్లు వెల్లడించారు. బుధవారం ఈ మేరకు పద్మా వతిపురంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయం వద్ద పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కొండారెడ్డి తన అనుచరులతో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ భూమ న కరుణాకరరెడ్డి, జిల్లా అధ్యక్షుడు అభినయ్‌రెడ్డి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి నీలం బాలాజి, మేయర్‌ అభ్యర్థి వాసుయాదవ్‌, నేతలు బ్రహ్మానందరెడ్డి, గోపాల్‌రెడ్డి, మల్లం రవికుమార్‌రెడ్డి, కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement