ఘర్షణలో కేసులో ముగ్గురి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఘర్షణలో కేసులో ముగ్గురి అరెస్ట్‌

Oct 29 2026 2:24 AM | Updated on Oct 29 2026 2:24 AM

బుచ్చినాయుడుకండ్రిగ : మండలంలోని పార్లపల్లె దళితవాడలో జరిగిన ఇరువర్గాల ఘర్షణ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు శ్రీకాళహస్తి డీఎస్పీ పావని తెలిపారు. బుధవారం ఈ మేరకు బీఎన్‌ కండ్రిగ పోలీస్‌స్టేషన్‌లో నిందితుల అరెస్ట్‌ను చూపారు. డీఎస్పీ కథనం మేరకు.. దళితవాడకు చెందిన బద్రి, జగదీష్‌, కుటుంబ సభ్యులకు, సుబ్రమణ్యం, బాలాజీ, హరి కుటుంబ సభ్యులకు నాలుగు నెలల క్రితం జరిగిన మాతమ్మ కొలువులో గొడవలు జరిగాయి. గ్రామ పెద్దలు సర్ది చెప్పి, రాజీ కుదిర్చారు.. మంగళవారం సుబ్రమణ్యం మామా మరణించడంతో అంత్యక్రియలు అనంతరం మద్యం మత్తులో ఉన్న బద్రి, జగదీష్‌, శ్రీకాళహస్తి చెందిన మునికుమార్‌, సాయిలు సుబ్రమణ్యం, బాలాజీ కుటుంబ సభ్యులపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో సుబ్రమణ్యం, బాలాజీ తీవ్రంగా గాయపడ్డారు. బాలాజీ భార్య, మేనకోడలు, మరో ఇద్దరు మహిళలకు స్వల్పగాయాలైయ్యాయి. బాధితులను శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ కేసుకు సంబంధించి జగదీష్‌, హేమంత్‌, మునికుమార్‌ను అరెస్టు చేశారు. మరో నిందితుడు బద్రిని అరెస్టు చేయాల్సి ఉంది. సీఐ లక్ష్మీనారాయణ, ఎస్‌ఐ హరిప్రసాద్‌ పాల్గొన్నారు.

5న పరిషత్‌ ఎన్నికలు

తిరుపతి అర్బన్‌ : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నవంబర్‌ 5వ తేదీన నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ బుధవారం వెల్లడించారు. అలాగే ఎక్కడైనా ఇబ్బందులు చోటుచేసుకుంటే రీ పోలింగ్‌ 6న చేపట్టి, 7వ తేదీన కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు. నవంబర్‌ 3వ తేదీన మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ ఉండడంతో పరిషత్‌ ఎన్నికల తేదీని మార్చినట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement