ఈమె పేరు చిలకా స్వాతి. సూళ్లూరుపేట మండలం కడపట్ర ఎంపీటీసీ సెగ్మెంట్ బీసీ మహిళకు కేటాయించడంతో నామినేషన్ చేయడానికి సూళ్లూరుపేట పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రానికి వచ్చారు. అక్కడ కూటమి నేతలు లోపలకు పోనీకుండా ఆడ్డుకున్నారు. ఎస్ఐ అజయ్‌కుమార్‌కి ఫిర్యాదు చేసినా ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. 144 సెక్షన్ అమలులో ఉన్నప్పటికీ కూటమి నేతలు గుంపులుగానే ఉన్నారు. గతంలో ఇదే పంచాయతీ సర్పంచ్‌గా పనిచేసిన ఆమెకు మళ్లీ ఎంపీటీసీగా అవకాశం వచ్చినా కూటమి రౌడీమూకల కారణంగా బరిలో నిలవలేకపోయారు.


