ఎన్నికల విధుల్లో నూతన కానిస్టేబుళ్లు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశించారు.
ఆదేశించాకే.. ప్రకటించారు
జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల అభ్యర్థుల ఫైనల్ జాబితా మంగళవారం సాయంత్రానికే వెళ్లడించాల్సి ఉంది. అయితే టీడీపీ, జనసేన అభ్యర్థుల మధ్య పొత్తుల పంచాయితీ తేలకపోవటంతో.. అర్థరాత్రి వరకు ఫైనల్ జాబితాను ప్రకటించకుండా అధికారులు వేచి చూశారు. అధికారపార్టీ నాయకులు చెప్పినట్లు ఎన్నికల అధికారులు నడుచుకుంటున్నారన్నదానికి ఇదో నిదర్శనమని ఓ ఉన్నతాధికారి ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు ఆదేశిస్తే.. ఎన్నికల అధికారులు పాటించడంపై ప్రజాస్వామ్య వాదులు మండిపడతున్నారు.


