తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 10 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు 79,774 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 21,886 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.84 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.
స్విమ్స్‌లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స
తిరుపతి తుడా: రాష్ట్ర ప్రభుత్వ జీవన్‌దాన్ పథకం కింద అందిన కిడ్నీలతో స్విమ్స్‌లో విజయవంతంగా ఇద్దరి రోగులకు మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించినట్లు డైరెక్టర్ డాక్టర్ జగదీష్ తెలిపారు. నెఫ్రాలజీ, యూరాలజీ, అనస్తీషి యా విభాగాలతో పాటు అవయవ మార్పిడి సమన్వయ బృందం సమష్టి కృషితో శస్త్రచికిత్సలు పూర్తి చేశామని చెప్పారు. రోగులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ నెల్లూరులోని అపోలో ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించబడిన దాత నుంచి సేకరించిన కిడ్నీల ను స్విమ్స్‌కు కేటాయించారని వెల్లడించారు. ఈ కిడ్నీలను చిత్తూరు జిల్లా పెనుమూరు మండలానికి చెందిన 33 ఏళ్ల పురుషుడికి, తిరుపతి జిల్లా నాగలాపురం మండలానికి చెందిన 37 ఏళ్ల మహిళకు విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించామని వివరించారు.
శ్రీవారి సేవలో అపోలో చైర్మన్
తిరుమల : తిరుమల శ్రీవారిని అపోలో చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి బుధవారం సేవించుకున్నారు.ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరంరంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. టీటీడీ అధికారులు ఘనంగా లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు.


