అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.50లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. యువతకు అండగా నిలబడి నిరుద్యోగ సమస్యను పూర్తిగా నిర్మూలిస్తాం అన్నారు. ఆశించిన స్థాయిలో నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదు. జిల్లాలో ఎంతో మంది ఉద్యోగాల కోసం బెంగుళూరు, చైన్నె, హైదరాబాదు వంటి నగరాలకు వలస వెళుతున్నారు. – జె.మల్లికార్జున, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తిరుపతి
ఉద్యోగాలు ఎవరికిచ్చారో..
ఏడాదికి 4లక్షల ఉద్యోగాలు అన్నారు. ఆ ప్రస్తావనే లేదు. జాబ్‌మేళాల పేరుతో అటెండర్, సేల్స్‌మెన్, సెక్యూరిటీ వంటి ఉద్యోగాలను ప్రైవేటు కంపెనీలలో చూ పించడం అన్యాయం. ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులకు ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు విడుదల చేయా ల్సిందే. లేకుంటే నిరుద్యోగుల ఆగ్రహానికి గురికాకతప్పదు.
– లోకేష్, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి, తిరుపతి
మూల్యం చెల్లించకతప్పదు
నిరుద్యోగులను మభ్యపెట్టి మోసం చేసిన ఏ ప్రభుత్వాలు మనుగడ సాధించలేవు. యువత ఉద్యోగాల కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 60వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే తూతూ మంత్రంగా కేవలం 15వేలు భర్తీ చేసి చేతులు దులుపుకున్నారు. నిరుద్యోగులను మోసం చేస్తే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. – అక్బర్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి, తిరుపతి
●


