అభ్యర్థులకు భద్రత అవసరం | - | Sakshi
Sakshi News home page

అభ్యర్థులకు భద్రత అవసరం

Oct 29 2026 2:12 AM | Updated on Oct 29 2026 2:12 AM

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ పడుతున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు భద్రత కల్పించడం అవసరమని మాజీ డిప్యూటీ సీఎం నారా యణస్వామి డిమాండ్‌ చేశారు. బుధవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. జెడ్పీటీసీ అభ్యర్థితోపాటు నామినేషన్‌ వేసేందుకు వెళుతున్న సమయంలో తనపై బీగాలు రమేష్‌, అతని కుటుంబ సభ్యులు, పాల జనార్ధన్‌ దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలన్నారు. చిత్తూరు వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌ 127/2026 సెక్షన్‌ కింద కేసు సైతం నమోదైందని తెలిపారు. ఎమ్మెల్యే థామస్‌ తమిళనాడుకు చెందిన రౌడీలను తీసుకొచ్చి తనపై దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. కార్వేటినగరం మండలంలోని బీకేఆర్‌ కల్యాణమండపం, ఎస్‌ఆర్‌ పురంలోని శంకర్‌నాయుడు కల్యాణమండపం, పెనుమూరులో ఇలా పలుచోట్ల తమిళనాడుకు చెందిన రౌడీలను భారీ సంఖ్యలో ఉంచారని వెల్లడించారు. వెదురు కుప్పం గ్యాస్‌ గోడౌన్‌ దగ్గర వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడి చేయించారని మండిపడ్డారు. ఎస్‌ఆర్‌ పురంలో జ్యోతి రెడ్డి దాడి చేసిన వీడియోను మీడియాకు చూపించారు. జీడి నెల్లూరులో మహిళ అభ్యర్ధి మోహన కుమారి వద్ద ఉన్న నామినేషన్‌ చింపి వేయడం, పెనుమూరు జెడ్పీటీసీ నామినేషన్‌ వేసిన నీరోషారెడ్డిపై జెడ్పీ హాల్లోనే దాడి చేశారన్నారు. అల్లగుంటలో వెంకటేష్‌ అనే వ్యక్తి పై దాడి చేశారనే అధారాలను సేకరించామన్నారు. ఎన్నికల్లో జరిగిన ఘటనలపై తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీబీఐ విచారణ జరిపిస్తామని తెలిపారు. టీడీపీ నేతలు చెప్పిన మాటలు వింటే, భవిష్యత్‌లో అధికారులు ఇబ్బందిపడతారని హెచ్చరించారు. నేతలు హేమసుందర్‌రెడ్డి, పేట ధనుంజయరెడ్డి, గణపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement