స్కూటీని ఢీకొన్న కారు | - | Sakshi
Sakshi News home page

స్కూటీని ఢీకొన్న కారు

Oct 28 2026 1:30 AM | Updated on Oct 28 2026 1:30 AM

● విద్యార్థి మృతి ● మరో విద్యార్థికి తీవ్ర గాయాలు

చంద్రగిరి: ఎదురుగా వస్తున్న కారు స్కూటీని ఢీకొన్న ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందగా, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం తిరుపతి–మదనపల్లి జాతీయ రహదారి భాకరాపేట కనుమలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని నరసింగాపురం గ్రామానికి చెందితన లక్ష్మీశ్రీనివాస్‌ (21) ఎంబీయూలో బీటెక్‌ చదువుతున్నాడు. తనతో పాటు చదువుతున్న తన స్నేహితుడు సుబహాన్‌తో కలసి స్కూటీలో వారి స్వగ్రామమైన పీలేరుకు వెళ్లారు. ఆపై అక్కడి నుంచి మంగళవారం తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో తిరుపతి నుంచి మదనపల్లి వైపుగా వెళ్తున్న కారు భాకరాపేట కనుమలో ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లక్ష్మీప్రసాద్‌తో పాటు సుబహాన్‌ని తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ లక్ష్మీప్రసాద్‌ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో క్షతగాత్రుడు సుబహాన్‌ కాలుకు తీవ్ర గాయం కావడంతో మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. లక్ష్మీశ్రీనివాస్‌ మృతదేహాన్ని తిరుపతి ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ అరుణాచలం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement