శ్రీవారి దర్శనానికి 20 గంటలు | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి 20 గంటలు

Sep 12 2026 12:36 AM | Updated on Sep 12 2026 12:36 AM

● రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం 6.94

● రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం 6.94

తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 29 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. గురువారం అర్ధరాత్రి వరకు 69,771 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,888 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో రికార్టు స్థాయిలో హుండీలో రూ.6.94 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారికి 3 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement