తిరుపతి సిటీ: ఎస్వీయూ వైరాలజీ విభాగం ప్రయోగశాలలకు ఐఎస్‌ఓ గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా అక్రిడిటేషన్‌తో పాటు, విద్యాసేవలు, శక్తి నిర్వహణ, పర్యావరణ నిర్వహణ, లింగ సున్నితత్వానికి సంబంధించిన మూడు ధ్రువీకరణ పత్రాలను ప్రయోగశాలకు అందజేశారు. ఐఎస్‌ఓ గుర్తింపు రావడం పట్ల వీసీ టాటా నర్సింగరావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు, అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
పరిశోధన అవకాశాలపై వర్క్‌షాపు
తిరుపతి సిటీ: ఎస్వీయూ వైరాలజీ విభాగం విద్యార్థులు, పరిశోధకులలో అంతర్జాతీయ పరిశోధనా అవకాశాల గురించి అవగాహన కల్పించడం, సమర్థవంతమైన ప్రాజెక్ట్ ప్రతిపాదనలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో జర్మనీలో పరిశోధనా అవకాశాలు, ప్రాజెక్ట్ ప్రతిపాదన రచన అనే అంశంపై వర్సిటీలో వర్క్‌షాపు నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమానికి సైన్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఆచార్య ఓవీఎస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పరిశోధనా నైపుణ్యాలను బలోపేతం చేసుకోవాలని సూచించారు. చైన్నెకి చెందిన డీఏఏడీ సమాచార కేంద్రం ప్రాంతీయ అధికారిణి ఆచార్య ఆంటోనెట్ స్టీఫెన్ జర్మనీలో ఉన్నత విద్య, పరిశోధన అవకాశాలు, విద్యార్థులు, పరిశోధకులకు అందుబాటులో ఉన్న వివిధ మార్గాలు, విద్యా, పరిశోధనా సహకారాలకు మద్దతు ఇవ్వడంలో డీఏఏడీ పాత్ర గురించి విలువైన సమాచారాన్ని అందించారు. ప్రొఫెసర్ వసుధారాణి దేవనాథన్, ప్రొఫెసర్ రజని, అధ్యాపకులు, పరిశోధకులు పాల్గొన్నారు.


