తిరుపతి రూరల్: వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్టు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే మండపాల్లో విద్యుత్ ప్రమాదాలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వినాయక మండపాలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 కిలోవాట్లు, పట్టణ ప్రాంతాల్లో 5 కిలోవాట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు తెలిపారు. అత్యవసర సమాచారం కోసం 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు.
14న స్విమ్స్ ఓపీ, ఓటీలకు సెలవు
తిరుపతి తుడా: వినాయక చవితి పర్వదినం సందర్భంగా స్విమ్స్ ఓపీ, ఓటీ విభాగాలకు సెలవు ప్రకటించినట్టు డైరెక్టర్ డాక్టర్ జగదీష్ ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసర సేవలు యథాతథంగా కొనసాగుతాయన్నారు.


