– 8లో
– 8లో
తిరుమలలో మాక్ డ్రిల్
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు మాక్ డ్రిల్ నిర్వహించారు.
సన్న బియ్యం పంపిణీ గాలికి!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి జిల్లాలో పౌరసరఫరాల శాఖ తీరు అధ్వాన్నంగా మారింది. పేద ప్రజల ఆకలి తీర్చేందుకు సన్న రకం బియ్యం అందజేస్తామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు ప్రచారానికే పరిమితమైంది. ఒక ప్రజాప్రతినిధి, జిల్లా ఉన్నతాధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ పేదల ప్రయోజనాలను గాలికి వదిలేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మిల్లర్లతో కుమ్మకై ్క నాసిరకం బియ్యాన్ని ప్రజలకు అంటగడుతూ కోట్లాది రూపాయల దందా నడిపిస్తున్నారని లబ్ధిదారులు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.
దందా షురూ
గతంలో కాకినాడలో పనిచేసిన సమయంలో తీవ్ర అక్రమాలకు పాల్పడిన ఒక వివాదాస్పద అధికారిని ఏరికోరి ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన తిరుపతికి బదిలీ చేయడం వెనుక ఉన్న మర్మమేమిటని అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఇక్కడ కూడా మిల్లర్లతో చేతులు కలిపి వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు నాణ్యతా ప్రమాణాలను పరిశీలించాల్సిన మరొక అధికారి గతంలో నెల్లూరులో అడ్డగోలు వ్యవహారాలు నడిపి, ఇప్పుడు తిరుపతిలో నాణ్యత లేని బియ్యానికి మంచి మార్కులు ఇస్తూ మిల్లర్ల నుంచి భారీగా ముడుపులు దండుకుంటున్నారని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నాసిరకం బియ్యం
రైస్ మిల్లుల వద్ద ప్రత్యేక కౌంటర్లు తెరిచి సన్న బియ్యం పంపిణీ చేయాలన్న కూటమి ప్రభుత్వ ప్రకటనలు కేవలం ప్రచారానికే పరిమితమయ్యాయి. కౌంటర్లు తెరిచామని కాగితాల్లో లెక్కలు చూపుతున్న అధికారులు, వాస్తవానికి నాణ్యమైన బియ్యం అందకుండా గండికొడుతున్నారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న బియ్యం తినడానికి పనికిరావడం లేదని, వండినా ఉడకక దుర్వాసన వస్తుండడంతో పశువుల దాణాకు తప్ప మనుషులకు ఉపయోగపడడం లేదని కార్డుదారులు వాపోతున్నారు. మంత్రి అండదండలతో అవినీతి అధికారుల లాలూచీ వల్ల పేదల కడుపు కొడుతున్నారని ప్రజలు ధ్వజమెత్తుతున్నారు. సీఎం సొంత జిల్లాలోనే ఇలాంటి అక్రమాలు జరగడం సిగ్గుచేటని, తక్షణమే విచారణ జరిపి బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేసి, నాణ్యమైన సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


