తిరుపతి సిటీ: ‘‘ఇది రాజకీయ కార్యక్రమం కాదు.. పార్టీల జెండాలు అసలే ఉండవు.. యువత భవిష్యత్తుకు భరోసానిచ్చే నైలెట్ శాశ్వత క్యాంపస్‌ను కుట్రతో తిరుపతి నుంచి తరలించే ప్రయత్నాన్ని అడ్డుకుందాం.. తిరుపతి ఆత్మ గౌరవాన్ని నిలబెడదాం.. ఎస్వీయూకు తలమానికంగా నిలిచిన కేంద్ర ప్రభుత్వ సంస్థను తిరుపతి నుంచి తరలించవద్దని ప్రభుత్వాన్ని నిలదీయడం.. తరలింపు కుట్రను అడ్డుకోవడం.. ఇదే జన్‌జెడ్ భారీ ర్యాలీ ప్రధాన ఉద్దేశం’’ అని విద్యార్థి, యుజవన సంఘాల నేతలు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం 10గంటలకు ఎస్వీయూ రెండో గేటు నుంచి వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద వరకు భారీ ఎత్తున విద్యార్థులు, నిరుద్యోగ యువతతో జెన్‌జెడ్ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం ఎస్వీయూ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ ర్యాలీలో పార్టీల కతీతంగా యువత, విద్యార్థులు, పలు పార్టీలకు చెందిన నేతలు, మేధావులు, స్థానికులు హాజరై ప్రభుత్వ కుట్రపై గళమెత్తనున్నారు.


