గొల్లపల్లి సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కాలేజీలో క్యాంపస్‌ ఇంటర్వ్యూలు | - | Sakshi
Sakshi News home page

గొల్లపల్లి సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కాలేజీలో క్యాంపస్‌ ఇంటర్వ్యూలు

Sep 11 2026 8:10 AM | Updated on Sep 11 2026 8:10 AM

తిరుపతి రూరల్‌: తిరుపతి రూరల్‌ మండలం సి.గొల్లపల్లిలోని సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కాలేజీలో గురువారం క్యాంపస్‌ ఇంటర్వూలు నిర్వహించారు. బెంగళూరుకు చెందిన ప్రముఖ ‘గ్లోబల్‌ క్వస్ట్‌ టెక్నాలజీస్‌’ సంస్థ వారు ఇంజినీరింగ్‌ నాలుగవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ ఇంటర్వ్యూలు నిర్వహించారు. అన్ని రౌండ్లలో విశేష ప్రతిభ కనబరచిన 25 మంది విద్యార్థులు ఉద్యోగ అర్హత సాధించగా వారందరికీ నియామక పత్రాలను అందించారు. కళాశాలలో జరిగిన అభినందన సభలో ఉద్యోగ అర్హత సాధించిన విద్యార్థులను కళాశాల సెక్రటరీ వై.ఆనందరెడ్డి, ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ రాజశేఖర్‌, ప్లేస్‌మెంట్స్‌ డైరెక్టర్‌ స్వామినాథ్‌, టీపీఓ భాస్కర్‌ తదితరులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement