శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమలలోని పురోహిత సంఘం వద్ద ప్రత్యేక పుష్ప ప్రదర్శనకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేక ఆకృతులను తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భక్తులకు ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగించేలా పుష్ప ప్రదర్శనను అందంగా ముస్తాబు చేస్తున్నారు. ఇప్పటికే ప్రదర్శన ఏర్పాట్లకు సంబంధించిన పనులు ప్రారంభం కాగా, సిబ్బంది వాటిని వేగవంతం చేశారు. పుష్పాల ఎంపిక, అలంకరణ, వివిధ ఆకృతుల రూపకల్పన పనులు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే నాటికి పుష్ప ప్రదర్శనను పూర్తి స్థాయిలో సిద్ధం చేసేందుకు నిర్వాహకులు చర్యలు చేపడుతున్నారు. – తిరుమల


