నాయుడుపేట టౌన్: మేనకూరు సెజ్ పరిధిలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న లోకేశ్వరన్‌బాబు(35) ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం.. తమిళనాడు రాష్త్రం, రాణిపేట జిల్లా, తెరుంబలిపాకం గ్రామానికి చెందిన లోకేశ్వరన్ మేనకూరు సెజ్ పరిధిలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాయుడుపేట పట్టణంలోని రాజగోపాలపురం 4వ వీధిలోని ఓ ఇంట్లో అద్దెకుంటున్నారు. రెండు రోజుల నుంచి లోకేశ్వరన్ బాబు ఫోన్ తీయక పోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి గురువారం నాయుడుపేటకు వచ్చి ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఇంట్లో నైలాన్ తాడుతో ఆత్మహత్య చేసుకుని ఉండడాన్ని గుర్తించారు. ఆత్మహత్యకు సంబంధించి కారణాలు తెలియరాలేదు. కేసు దర్యాప్తులో ఉంది.


