తిరుపతి సిటీ: జిల్లాలో ప్రభుత్వ, టీటీడీ, ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీ ప్రవేశాల కోసం ఓఏఎమ్‌డీసీ విడుదల చేసిన తొలి విడిత మెరిట్ లిస్ట్ ప్రవేశాలు గురువారం ముగిశాయి. ప్రభుత్వ కళాశాలల్లో తొలి విడత ప్రవేశాలలో కనీసం 40 శాతం సీట్లు భర్తీ కాకపోవడం గమనార్హం. అలాగే టీటీడీ ఆధ్వర్యంలో నడస్తున్న ఎస్పీడబ్ల్యూ, ఎస్వీ ఆర్ట్స్, ఎస్‌జీఎస్ కళాశాల్లో మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రవేశాలు జరిగినట్లు తెలుస్తోంది. అలాగే జిల్లాలోని ప్రైవేటు డిగ్రీ కళాశాల సైతం తొలి విడతలో అంతంతమాత్రంగానే ప్రవేశాలు జరిగాయని గత ఏడాది కంటే పరిస్థితి దారుణంగా ఉందని యాజమాన్యాలు వాపోతున్నాయి. రెండవ విడత ప్రవేశాల ప్రక్రియ వచ్చేవారం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
టీటీడీ విద్యాసంస్థల్లో తొలి విడతలో జరిగిన ప్రవేశాల వివరాలు
డిగ్రీ కళాశాల మొత్తం సీట్లు తొలివిడతలో కేటాయించినవి భర్తీ అయిన సీట్లు మిగిలినవి
ఎస్‌జీఎస్ 1068 703 444 624
ఎస్వీ ఆర్ట్స్ 1417 1206 848 569
ఎస్పీడబ్ల్యూ 1550 1354 1115 435


