నాన్న చదివిన కళాశాలలోనే సీటు సాధించా | - | Sakshi
Sakshi News home page

నాన్న చదివిన కళాశాలలోనే సీటు సాధించా

Aug 30 2026 7:18 AM | Updated on Aug 30 2026 7:18 AM

మాది తిరుపతి. నాన్న కే.అశోక్‌రెడ్డి ప్రముఖ ఈఎన్‌టీ వైద్యునిపుణులు. తండ్రిని ఆదర్శంగా తీసుకున్నా. ఇంటర్మీడియెట్‌ నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో పూర్తి చేశా. నీట్‌కు ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ నుంచే సన్నద్ధమయ్యా. రోజుకు 8 గంటలకు పైగా శ్రమించా. ఆల్‌ ఇండియా కోటాలో 3,718 ర్యాంకు సాధించా. స్టేట్‌ ర్యాంకు 150 వచ్చింది. నాన్న చదివిన కళాశాలలోనే నేను ఎంబీబీఎస్‌లో చేరడం సంతోషంగా ఉంది.

– తల్లిదండ్రులతో కే.అభిజ్ఞారెడ్డి, ఎస్వీఎమ్‌సీలో ప్రవేశం పొందిన విద్యార్థిని, తిరుపతి

కోచింగ్‌ లేకుండా.. తొలి ప్రయత్నంలోనే

చిన్ననాటి నుంచి డాక్టర్‌ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నా. నాన్న సుజిత్‌కుమార్‌ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. తిరుచానూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ పూర్తిచేశా. ఎక్కడా కోచింగ్‌ తీసుకోలేదు. అమ్మ ప్రోత్సాహంతో స్వతహాగా నీట్‌కు సన్నద్ధమయ్యా. ఆల్‌ ఇండియా స్థాయిలో 10,508 ర్యాంకు సాధించా. స్టేట్‌ ర్యాంకు 336 వచ్చింది. నేను అనుకున్న ఎస్వీ వైద్య కళాశాలలో సీటు రావడం సంతోషంగా ఉంది.

– తండ్రి సుజిత్‌కుమార్‌తో విద్యార్థిని విష్ణుప్రియ, ఎస్వీఎమ్‌సీ, తిరుపతి

రోజుకు 9 గంటలకుపైగా కష్టపడ్డా

మాది నెల్లూరు. నాన్న సూర్యకుమార్‌ రిటైర్డ్‌ షార్‌ సైంటిస్ట్‌. ఇంటర్మీడియెట్‌ నెల్లూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో పూర్తి చేశా. తొలి ప్రయత్నంలో ఆశించిన ర్యాంకు రాలేదు. రెండో ప్రతయ్నంలో నీట్‌కు లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ తీసుకున్నా. రోజుకు 9 గంటలపైగా కష్టపడ్డా. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆల్‌ఇండియా స్థాయిలో 7,019ర్యాంకు సాధించా. స్టేట్‌ ర్యాంకు 98 వచ్చింది. ఎస్వీ వైద్య కళాశాలలో సీటు సాధించా.

–తండ్రి సూర్యకుమార్‌తో విద్యార్థి ఏఎస్‌పీ కుమారకుశాల్‌, ఎస్వీఎమ్‌సీ, తిరుపతి

అమ్మ ప్రోత్సాహం మరువలేనిది

మాది వైఎస్సాఆర్‌ కడప. నాకు రెండేళ్లప్పుడే నాన్న చనిపోయారు. అమ్మ తెలుగు గంగ విభాగంలో చిరుద్యోగి. చిన్నతనంలోనే నాన్న లేకపోవడంతో అమ్మ అన్నీ తానై కష్టపడి చదివించింది. కడపలోని ఓ ప్రైవేటు కళాశాలలో నీట్‌ కోచింగ్‌ తీసుకున్నా. రెండో ప్రయత్నంలో నీట్‌లో ఆల్‌ ఇండియా కోటాలో 52,534 ర్యాంకు సాధించా. స్టేట్‌ ర్యాంక్‌ 1,260 వచ్చింది. ఎస్వీ వైద్య కళాశాలలో సీటు రావడం సంతోషంగా ఉంది.

– తల్లి జయమ్మతో విద్యార్థి వెంకటనరేష్‌, ఎస్వీఎమ్‌సీ, తిరుపతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement