తిరుపతి అర్బన్: పులికాట్ సరస్సులోని చేపలను తమిళనాడు మత్స్యకారులు దోపిడీ చేస్తున్నారని మత్స్యకారుల సంఘం నేతలు ఏ.వాసు, కే.వాసు, జీ.శివకుమార్, ఎం.రాజేంద్రన్, బీ.ధనంజయ్ మండిపడ్డారు. గురువారం కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పులికాట్ సరస్సులోని ఆంఽధ్రకు చెందిన ప్రాంతంలో మత్స్య సంపదను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ప్రశ్నిస్తే తమపై దాడులు చేస్తున్నారని వాపోయారు. అంతేకాకుండా తమిళనాడు పోలీసుల ద్వారా కేసులు పెట్టిస్తున్నారని పేర్కొన్నారు. పులికాట్ సరస్సులో ఆంధ్ర ప్రాంతం వరకు సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.


