స్విమ్స్‌ డైరెక్టర్‌, వీసీగా.. | - | Sakshi
Sakshi News home page

స్విమ్స్‌ డైరెక్టర్‌, వీసీగా..

Aug 30 2026 7:18 AM | Updated on Aug 30 2026 7:18 AM

తిరుపతి తుడా: స్విమ్స్‌ నూతన డైరెక్టర్‌, వీసీగా డాక్టర్‌ జీ.జగదీష్‌ గురువారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలందుబాటులోకి తీసుకెళ్తామని తెలిపారు. స్విమ్స్‌ డాక్టర్ల బృందంతో సమన్వయం చేసుకుని పేద రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలందించడమే లక్ష్యంగా కృషి చేస్తానన్నారు. అనంతరం ఆయన టీటీడీ ఛైర్మన్‌ను కలిసి జాయినింగ్‌ లెటర్‌ను అందజేశారు. స్విమ్స్‌ హాస్పిటల్‌, బర్డ్‌ హాస్పిటల్‌ వైద్యులు, ఫ్యాకల్టీ, సిబ్బంది పాల్గొన్నారు.

ఉద్యోగుల సమస్యలపై..

స్విమ్స్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఏపీ ఎన్‌జీవో తిరుపతి జిల్లా అధ్యక్షుడు ఎస్‌. సురేష్‌ బాబు, మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిబాబు, కిరణ్‌, కేసీ.సుబ్రహ్మణ్యం లోకేష్‌, మోహిద్దీన్‌ సూచించారు. ఈ మేరకు నూతన స్విమ్స్‌ డైరెక్టర్‌ను కలిసి అభినందనలు తెలిపారు.

ముగిసిన ఏఈఈ

నియామక పరీక్షలు

తిరుపతి రూరల్‌: ఏపీఎస్పీడీసీఎల్‌ పరిధిలో ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరిగిన అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(ఏఈఈ) పోస్టుల నియామక పరీక్షలు ప్రశాంతం ముగిసిన ట్టు ఆ సంస్థ చైర్మన్‌ – మేనేజింగ్‌ డైరెక్టర్‌ శివశంకర్‌ లోతేటి పేర్కొన్నారు. ఏపీఎస్పీడీసీఎల్‌ పరిధిలోని 34 పరీక్షా కేంద్రాల్లో ఐదు రోజులపాటు ఉదయం, సాయంత్రం రెండు విడతలుగా ఈ పరీక్షలను నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఏపీఎస్పీడీసీఎల్‌ పరిధిలోని తొమ్మిది జిల్లాల్లో ఏఈఈ నియామక పరీక్షలకు మొత్తం 36,670 మంది దరఖాస్తు చేసుకోగా 31,075 మంది హాజరయ్యారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement