బీఎల్‌ఓల నేతృత్వంలో ఓటర్లకు నోటీసులు
11 రకాల్లో ఏదైనా గుర్తింపు కార్డులు
అందించాలి
ఎంప్లాయీ లేదా పింఛనుదారు గుర్తింపు కార్డు
ప్రభుత్వం లేదా బ్యాంకులు, పోస్ట్‌ఆఫీస్, ఎల్‌ఐసీ వారు 1–7–1987కు ముందు జారీ చేసిన పత్రం
జనన ధ్రువీకరణ పత్రం
మెట్రిక్యులేషన్ లేదా ఇతర సర్టిఫికెట్
శాశ్వత నివాస ధృవీకరణ పత్రం
అటవీ హక్కుల సర్టిఫికెట్
కుల ధ్రువీకరణ పత్రం
కుటుంబ రిజిస్టర్
భూమి లేదా ఇంటి కేటాయింపు సర్టిఫికెట్
ఆధార్ కార్డు
జాతీయ పౌరపట్టిక (అందుబాటులో ఉన్న ప్రాంతం)
ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన ఓటును రక్షించుకునేందుకు చివరి అవకాశం వస్తోంది. ఓటర్ల సవరణ ప్రక్రియ కింద ముసాయిదా జాబితాలో లేని వారికి మరో వెసులుబాటును ఎన్నికల సంఘం కల్పిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే జిల్లావ్యాప్తంగా సందిగ్ధంలో పడిన దాదాపు 4.01లక్షల ఓట్లకు సంబంధించి నోటీసులు జారీ చేస్తోంది. సరైన గుర్తింపు పత్రాలను చూపించాలని సూచిస్తోంది. లేకుంటే ఓటు హక్కును కోల్పోయే ప్రమాదముందని హెచ్చరిస్తోంది.
తిరుపతి అర్బన్ : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పేరుతో జూన్ 15 నుంచి జూలై 24వ తేదీ వరకు 40 రోజుల పాటు ఇంటింటా సర్వే పేరుతో బీఎల్వోలు పరిశీలన చేపట్టారు. జూలై 31న ప్రత్యేక ముసా యిదా ఓటర్ల జాబితాను వెల్లడించారు. జిల్లాలో 14,81,603 మంది ఓటర్లను మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చారు. అయితే సర్ ప్రక్రియకు ముందు జిల్లాలో 17,69,429 మంది ఓటర్లు ఉండేవారు. తర్వాత జిల్లా వ్యాప్తంగా 2,87,826 మంది ఓటర్లు తగ్గిపోయారు. మరోవైపు 1,62,230 మంది ఓటర్లు ముసాయిదా జాబితాలో ఉన్నప్పటికీ వీరి ఓట్లు మ్యాపింగ్ కాలేదు. అలాగే వ్యత్యాసాలు ఉన్నాయంటూ మరో 2,38,980 మంది ఓటర్లను పెండింగ్‌లో పెట్టారు. దీంతో మొత్తంగా 4,01,210 ఓటర్లకు నోటీసులు బుధవారం నుంచి పంపిణీ చేస్తున్నారు. అనంతరం ఎలక్షన్ కమిషన్ సూచించిన మేరకు ఆధార్‌కార్డుతోపాటు 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక్కటి బీఎల్వోలకు అందించాల్సి ఉంటుంది. సరైన గుర్తింపుకార్డును అందించి...బీఎల్వోలు ఓకే చెబితేనే ఆయా ఓట్లకు భద్రత ఉంటుంది.
జిల్లావ్యాప్తంగా సందిగ్ధంలో 4.01లక్షల ఓట్లు
ఓటర్లు చూపించాల్సిన గుర్తింపు కార్డు


