సమయం.. సద్వినియోగం | - | Sakshi
Sakshi News home page

సమయం.. సద్వినియోగం

Jul 16 2026 5:42 AM | Updated on Jul 16 2026 5:42 AM

● ఓటర్ల సవరణ ప్రక్రియపై సమీక్ష

తిరుపతి అర్బన్‌: స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ ( సర్‌ ) ప్రక్రియకు ఈ నెల 24 వరకు పెంచిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం కార్యదర్శి ఎస్‌హెచ్‌ సంజీవ్‌కుమార్‌ ప్రసాద్‌తో కలిసి బుధవారం కలెక్టరేట్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారావ జిల్లాలోని బీఎల్‌ఓలు, మండల, డివిజన్‌ స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టిన ఓటర్ల సవరణ ప్రక్రియ వివరాలను వెల్లడించారు. మొత్తం 2,099 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. అలాగే 17,00,096 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. 20.63 లక్షల జనాభా ఉన్నట్లు గుర్తించామన్నారు. ప్రస్తుతం జిల్లాలో 84శాతం ఓటర్ల మ్యాపింగ్‌ పూర్తి చేశామని, 14.78 లక్షల మంది వివరాలను డిజిటలైజేషన్‌ చేశామని వివరించారు. మృతులు, సమాచారం లేని వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి సంఖ్య 2,91,405గా నమోదైనట్లు తెలిపారు.

పౌరసత్వం ఉంటేనే ఓటు

ఎన్నికల సంఘం కార్యదర్శి ఎస్‌హెచ్‌ సంజీవ్‌కుమార్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ భారతీయ పౌరసత్వం ఉంటేనే ఓటు హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. విదేశీయుల ఓట్లు ఉంటే వాటిని ప్రత్యేకంగా పరిశీలన చేపట్టాలని ఆదేశించారు. చంద్రగిరి నియోజకవర్గంలో 16 మంది నేపాలీయుల ఓట్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని చెప్పారు.చంద్రగిరి ఎన్నికల నమోదు అధికారి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ఏడాది పొడవునా ఓటర్ల నమోదు, ఓటు హక్కుపై నిరంతరం అవగాహనలో భాగంగా నిరిష్టంగా ఒక రోజు కేటాయించాలని సూచించారు. తిరుపతి కార్పొరేషన్‌ ఇన్‌చార్జి కమిషనర్‌ శారదాదేవి, డీఆర్‌ఓ నరసింహులు, ఆర్‌డీఓలు రామ్మో హన్‌, భానుప్రకాష్‌రెడ్డి, దేవేంద్రరెడ్డి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు భరత్‌ నాయక్‌, రోజ్‌మాండ్‌, డీఆర్‌డీఏ పీడీ శోభన్‌బాబు, తహసీల్దార్లు సురేష్‌బాబు, జనార్ధన్‌, ఎన్నికల సూపరింటెండెంట్‌ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement