చంద్రగిరి : గ్రామ కంఠం భూమిని నకిలీ పత్రాలతో కబ్జా చేయడంపై స్థానికులు మండిపడ్డారు. సదరు స్థలంలోని వాటర్ ప్లాంట్‌ను తొలగించి చేపట్టిన నిర్మాణాలను పడగొట్టేందుకు యత్నించారు. ఇంతలో పోలీసులు రంగప్రవేశం చేశారు. వివాదం కోర్టు పరిధిలో ఉందని, ఏదైనా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. వివరాలు.. చంద్రగిరి పాతపేట దిగువవీధి వద్ద సర్వే నంబరు 449/1బీలో పంచాయతీకి చెందిన గ్రామకంఠం భూమిలో 10 ఏళ్ల క్రితం వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేశారు. 2014–19లో ఆ భూమిని కాజేయాలని అప్పటి సర్పంచ్ యత్నించడంతో నాటి ఎమ్మెల్యే చెవిరెడ్డి జోక్యం చేసుకుని వాటర్‌ప్లాంట్‌ను పునరుద్ధరించారు. అయితే ఈ భూమిపై కన్నేసి సదరు సర్పంచ్ తదనంతరం నకిలీ పత్రాలను సృష్టించి తన కుటుంబీకులపై పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించేశారు. ఇంటి పన్ను కూడా కట్టుకుంటూ గత ఏడాది రేవతి అనే మహిళకు ఆక్రమిత భూమిని వికయ్రించేశారు.
ఎమ్మెల్యేను అడ్డుకుంటాం
పంచాయతీ స్థలంతో అక్రమ నిర్మాణాలపై ఎమ్మెల్యే నానికి విన్నవించినా ఎలాంటి న్యాయం చేయలేదని స్థానికుల ఆవేదన వ్యక్తం చేశారు. మా ప్రాంతంలో ఎమ్మెల్యే నాని పర్యటిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు.
ఆందోళనకు దిగిన స్థానికులు
మాజీ సర్పంచ్ నుంచి కొనుగోలు చేసిన స్థలంలో రేవతి వాటర్‌ప్లాంట్‌ను తొలగించి, నిర్మాణాలను చేపట్టారు. దీంతో బుధవారం సాయంత్రం మూలస్థాన ఎల్లమ్మ వీది, దిగువీధి, రెడ్డివీధికి చెందిన స్థానికులు పార్టీలకు అతీతంగా వచ్చి పనులను అడ్డుకున్నారు. పంచాయతీ భూమిలో నిర్మాణాలను చేపట్టడంపై మండిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని స్థానికులను అడ్డుకున్నారు. పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. అయితే పంచా యతీ స్థలంపై ఇంత జరుగుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.


