సైదాపురం: రెండు రోజుల కిందట అదృశ్యమైన విద్యార్థి గంగ కాలువలో శవమై కన్పించాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. మండలంలోని చాగణం గ్రామానికి చెందిన బంకాపూరి సుబ్బయ్య కుమారుడు మణికంఠ గూడూరులోని ఓప్రైవేట్ కళాశాల్లో డిగ్రీ మొదటి సంవత్సరం విద్యను అభ్యసిస్తున్నాడు. మంగళవారం రాత్రి అదృశ్యమయ్యాడు. ఈ మేరకు ఎస్‌ఐ క్రాంతికుమార్ దర్యాప్తు చేపట్టారు. మర్లపూడి సమీపంలోనే ఉన్న తెలుగు గంగ ప్రధాన కాలువ వద్ద బైక్ మాత్రమే ఉండడంతో గంగ కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం మధ్యాహ్నం డక్కిలి సమీపంలో కండలేరు ప్రధాన కాలువ వద్ద శవమై కన్పించడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని మణికంఠ మృతదేహాన్ని గంగ కాలువ నుంచి బయటకు తీసి, పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


