ఘనంగా ఉగాది సంబరాలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా ఉగాది సంబరాలు

Mar 20 2026 9:15 AM | Updated on Mar 20 2026 9:15 AM

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలో, వెలుపల ఏర్పాటు చేసిన పుష్ప, విద్యుత్‌ దీపాలంకరణ భక్తులను ఆకట్టుకుంది. భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. స్వామి అమ్మవార్ల ఉత్సతమూర్తులకు వేదమంత్రోచ్ఛారణల నడుమ చందన, పంచామృతం, క్షీర, నారికేళ జలాలతో అభిషేకాలు చేశారు. అనంతరం విశేష పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఈఓ బీకే వెంకటేశులు, పాలకమండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

భక్తకన్నప్పకు సారె సమర్పణ

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో భాగంగా గురువారం తేరువీధిలోని భక్తకన్నప్పకు ఆలయం తరఫున సారె సమర్పించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ సారెను ఊరేగింపుగా తీసుకెళ్లారు. భక్తకన్నప్ప ఆలయంలో సారెను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈఓ బీకే వెంకటేశులు, పాలకమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆటో, కారు ఢీ

– నలుగురికి తీవ్ర గాయాలు

చంద్రగిరి: ఆటో, కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడిన ఘటన గురువారం చంద్రగిరి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. చంద్రగిరి జాతీయ రహదారి పెట్రోల్‌ బంకు వద్ద ఎదురెదురగా ఆటో, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో ప్రయాణిస్తున్న ముగ్గురు, కారులోని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 ద్వారా రుయాస్పత్రికి తరలించారు. ఈ మేరకు చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జ్యూస్‌ ఫ్యాక్టరీలో షెడ్లు దగ్ధం

బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలోని గాజులపెళ్లూరు సమీపంలోని రసా జ్యూస్‌ ఫ్యాక్టరీలో గు రువారం విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో 4 షెడ్‌లు ద గ్ధమయ్యాయి. దీంతో భారీ నష్టం వాటిల్లిందని యాజమాన్యం తెలిపింది. ఉగాది పండుగ కావడంతో ఫ్యాక్టరీలోని షెడ్లలో కార్మికులు లేరని, దీంతో ఎలాంటి ప్రాణహాని కలగలేదని పేర్కొంంది. శ్రీకాళహస్తి నుంచి ఫైర్‌ ఇంజిన్‌, అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసి, పక్కనే ఉన్న షెడ్లకు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. రెవెన్యూ, పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement