సత్యవేడులో ఉన్న సీహెచ్‌సీని 100 పడకల ఏరియా ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలి.
మండల కేంద్రంలోని ఇరుకురోడ్ల నుంచి మినహాయింపుగా బైపాస్ రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉంది.
గత ప్రభుత్వంలో మంజూరైన సత్యవేడు, నాగలాపురం మండలాల్లోని దాసుకుప్పం బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి.
సత్యవేడు కేంద్రంలో వైఎస్సార్ ముఖ్యమంత్రి హయాంలో ఏర్పాటు చేసిన డిగ్రీ కళాశాలకు పక్కా భవనాలు నిర్మాణం చేయాలి.
బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేసిన తహసీల్దార్ కార్యాలయం, కోర్టు భవనం, సబ్ జైలు కార్యాలయాలకు నూతన భవనాలు నిర్మాణం చేయాలి.
సత్యవేడు ప్రజల తాగునీటి అవసరాలకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మాణం చేయాలి.
గత ప్రభుత్వంలో నిరుద్యోగ యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి. ప్రైవేటు పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలని చేసిన చట్టాన్ని కొనసాగిస్తూ, అదే చట్టాన్ని శ్రీసిటీ పరిశ్రమల్లో అమలు చేయాలి.
నియోజకవర్గంలోని 7 మండల కేంద్రాల్లో డ్రైనేజీ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలి.
రైతాంగానికి ఎంతో అవసరమైన తెలుగుగంగ ఉపకాలువలకు ఆధునీకరణ పనులు చేపట్టాలి.
తాగునీటి చెరువుల అభివృద్ధి పనులు చేపట్టాలి.
ఆరణియార్ ప్రాజెక్ట్ ఆధునీకరణకు గత ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలి.
నాగలాపురం నుంచి టీపీకోటకు వెళ్లే రోడ్డు మార్గం డబుల్ రోడ్డుగా విస్తరించాలి.
బీఎన్‌కండ్రిగ నుంచి సూళ్లూరుపేటకు వెళ్లే రోడ్డు కూడా డబుల్ రోడ్డుగా విస్తరణ చేయాలి.
నాడు–నేడులో ఆగిపోయిన ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కొనసాగించాలి.
నియోజకవర్గంలోని 7 మండలాల్లో గ్రామీణ రోడ్ల అభివృద్ధి కోసం ఈఏపీ ద్వారా 36 రోడ్లు గత ప్రభుత్వంలో మంజూరయ్యాయి. అందులో 12 రోడ్ల నిర్మాణం పూర్తవ్వగా మరో 24 రోడ్లు పూర్తి కావాల్సి ఉంది.
సత్యవేడు–కడూరు కూడలి, సత్యవేడు – ఊత్తుకోట ప్రధాన రోడ్డు మార్గాలు పూర్తిగా గుంతలమయమై వాహన రాకపోకలకు ఇబ్బందిపడుతున్నారు. ఈ రెండు రోడ్లు అభివృద్ధి చేయాలి.
వరదయ్యపాళెం: ఎన్నికల సమయంలో చంద్రబాబుతోపాటు స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సత్యవేడుకు పలు హామీలిచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తకావస్తోంది. అయినా ఎన్నికల హామీలు అమలుకు నోచుకోలేదు. అభివృద్ధి పరంగా వెనుకబడిన సత్యవేడు నియోజకవర్గంలో అభివృద్ధి చేసే బాధ్యత తనదంటూ ఎన్నికల సమయంలో సత్యవేడుకు వచ్చిన ప్రస్తుత సీఎం చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చారు. ఆయన మోసపూరిత హామీలను నమ్మిన నియోజకవర్గ ప్రజలు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆదిమూలాన్ని గెలిపించారు. ఎమ్మెల్యే సైతం నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పలు హామీలు ఇచ్చినప్పటికీ ఒకటి కూడా ఆచరణ కాలేదు.
హామీలిచ్చి పరిష్కారం కాని సమస్యలివే..


