తిరుపతి తుడా: జాతీయ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయి పరిశోధన రంగంలో విశేష కృషి చేసిన ఎస్వీ వైద్య కళాశాల బహుళ క్రమశిక్షణ పరిశోధన యూ నిట్‌కు ప్రథమ స్థానం దక్కింది. ఈ మేరకు విజయవాడ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం వేదికగా బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎస్వీ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభుకు బహుళ పరిశోధన క్రమశిక్షణ యూనిట్ నోడల్ అధికారి డాక్టర్ ఏఎస్ కిరీటి, పీఆర్‌ఓ వీర కిరణ్‌కు వర్సిటీ వీసీ డాక్టర్ పి చంద్రశేఖర్ అవార్డులు అందజేశారు.
ప్రకృతి వ్యవసాయంతో భూసారం
తిరుపతి కల్చరల్: ప్రకృతి వ్యవసాయంతో భూసారం పెరుగుతుందని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. సహజ వ్యవసాయ ఉత్పత్తులకు రా ష్ట్ర స్థాయిలో బలమైన మార్కెట్ వేదికను ఏర్పా టు చేయాలనే ఉద్దేశంతో ‘కొనుగోలు–అమ్మకందారుల నెట్‌వర్క్ సమావేశం బుధవారం మహతి ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. సహజ వ్యవసాయంతో భూమి సారం కాపాడుకోవడంతో పాటు దిగుబడులు స్థిరంగా ఉంటాయన్నారు. యూరియా, రసాయన ఫర్టిలైజర్లు, పెస్టిసైడ్లు వినియోగం తగ్గించడంతో నేలలో జీవ వైవిద్యం పెరిగి, తేమ నిల్వ సామర్థ్యం మెరుగుపడుతుందని తెలిపారు. రసాయన అవశేషాలు లేని ఆహారం ప్రజలకు అందించడం ద్వారా రోగ్య రక్షణ సాధ్యమవుతుందన్నారు.
నోడల్ కేంద్రంగా
సిద్ధార్థ కళాశాల
నారాయణవనం: స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలకు యూనివర్సిటీ హ్యూమన్ వ్యా ల్యూస్(యూహెచ్‌వీ) నోడల్ కేంద్ర మంజూరైందని కళాశాల చైర్మన్ డాక్టర్ అశోకరాజు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండేళ్ల పాటు పనిచేసే నోడల్ కేంద్రాలకు దేశవ్యాప్తంగా 27 ఇంజినీరింగ్ కళాశాలలను నోడల్ కేంద్రాలుగా ఏఐసీటీఈ (ఆల్ ఇండియా కౌన్సి ల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్) ఎంపిక చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎంపికై న మూడు కళాశాలల్లో పుత్తూరు సిద్ధార్థ కళాశాలకు స్థానం లభించిందని పేర్కొన్నారు. రాబోవు రెండేళ్లు హ్యూమన్ వ్యాల్యూస్ కార్యక్రమాలను ఏఐసీటీఈ ఆదేశాల మేరకు నిర్వహిస్తామన్నారు. ఈనెల 27న న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కళాశాల మంజూరు పత్రాన్ని ఏఐసీటీఈ అధికారులు అధికారికంగా అందిస్తారన్నారు. కళాశాల ఎంపికపై ప్రిన్సిపాళ్లు మధుసూదనరెడ్డి, జనార్దనరాజు, రమేష్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
శ్రీవారి దర్శనానికి 10 గంటలు
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 4 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 27,300 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 9,985 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.46 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 10 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.
భద్రతా ప్రమాణాలకు
ప్రాధాన్యత ఇవ్వండి
తిరుపతి అర్బన్: జిల్లాలోని అన్ని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ వెంకటేశ్వర్ అదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సింగిల్ డెస్క్ విధానంలో కొత్త పరిశ్రమల కోసం వచ్చిన అన్ని దరఖాస్తులను పరిశీలన చేసి వేగవంతంగా వారికి అనుమతులు ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న 116 దరఖాస్తులను జాప్యం లేకుండా పరిష్కారం చూపాలన్నారు.


