షార్‌లో సైన్స్‌ దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

షార్‌లో సైన్స్‌ దినోత్సవం

Mar 5 2026 7:43 AM | Updated on Mar 5 2026 7:43 AM

సూళ్లూరుపేట: సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో బుధవారం జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మొహాలీలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చి (ఐఐఎస్‌ఈఆర్‌) ప్రొఫెసర్‌ డాక్టర్‌ టీవీ వేంకటేశ్వరన్‌ విచ్చేశారు. ముందుగా సర్‌ సీవీ రామన్‌ చిత్రపటానికి వద్ద నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజల్వన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన షార్‌ డైరెక్టర్‌ ఈఎస్‌ పద్మకుమార్‌ మాట్లాడుతూ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగిందన్నారు. ప్రొఫెసర్‌ డాక్టర్‌ టీవీ వేంకటేశ్వరన్‌ మాట్లాడుతూ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేస్తున్న ప్రయోగాలు ఎంతో అభినందనీయమనవని అన్నారు. ఈకార్యక్రమంలో షార్‌ కంట్రోలర్‌ జీ రమేష్‌బాబు, అసోసియేట్‌ డైరెక్టర్‌ ముత్తుచైళియన్‌, డీడీలు సీజీఎం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement